sye raa chiranjeevi lee కోసం చిత్ర ఫలితం

మెగాస్టార్ చిరంజీవి "సైరా నరసింహారెడ్డి" సినిమా సంచలనాలు వెల్లడౌతున్నాయి, అదీ ఆ చిత్ర టీజర్ విడుదలతోనే. తెలుగు స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రూపంలోకి పరకాయ ప్రవేశం చేసిన మెగాస్టార్ పవర్-ఫుల్ సౌరాగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో పోరాటాలు, యుద్ధసన్నివేశాలు, వాటి చిత్రీకరణ  ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. 
sye raa chiranjeevi lee కోసం చిత్ర ఫలితం
మహోత్సవంగా జరిగిన ఈ చిత్ర టీజర్ లాంచ్ చేసిన కార్యక్రమంలో చిత్ర యూనిట్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మరణశిక్ష అనుభవించిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితాన్ని యధాతధంగా తెస్తున్నారా? లేక మార్పులు చేసారా? అనే విలేఖరి ప్రశ్నకు దర్శకుడు సురేందరరెడ్డి ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నరసింహారెడ్డికి మరణశిక్ష విధించింది. 
sye raa chiranjeevi lee కోసం చిత్ర ఫలితం
ఆ మరణశిక్ష విధించిన సమాచారం "రాజపత్రం" (గెజిట్)లో పొందు పరిచినా ఆయనకు సంభందించిన చాలా అంశాలు ప్రజలకు తెలియదు. మరణశిక్ష రాజపత్రం, అందుబాటులోను ప్రచారంలోను ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని ఒక దృశ్యకావ్యంగా తెరకెక్కిస్తున్నామని దర్శకుడు సురేందరరెడ్డి తెలిపారు. 


ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర గురించి సురేందరరెడ్డి, సైరా చిత్ర యూనిట్ లోతుగా అధ్యయనం చేశారు. తొలి తరం తెలుగు స్వాతంత్ర సమరయోధుడు జీవితచరిత్రని దాదాపు ₹200 కోట్ల బడ్జెట్ తో వెండి తెరపై అద్భుతంగా నభూతో నభవిష్యతి గా ఆవిష్కరించబోతున్నారు.  హాలీవుడ్ ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ ళీ ఈ సైరా నరసింహారెడ్డి చిత్రానికి యాక్షన్ సన్నివేశాలని హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కంపోజ్ చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలోనే సైరా పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరుగు తోంది. జార్జ్ పావెల్, లీ వంటి ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ సైరా చిత్రం కోసం పనిచేస్తుండడం విశేషం.  హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ లీ అమెరికాకు చెందిన వ్యక్తి. ఆయన కూడా టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. 
sayraa chiranjeevi lee  కోసం చిత్ర ఫలితం
తెల్లవారైన ఆయనకు మీడియా నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.  బ్రిటిష్ వారు, అమెరికన్స్ అంతా తెల్లవారు. మా సైరా నరసింహారెడ్డి మీ తెల్లవారిని చంపు తుంటే ఎలా అనిపిస్తుంది? అని మీడియా నుంచి ఒక విలేకరి లీ పై ప్రశ్నను సంధించారు. అయితే ఈ ప్రశ్నకు లీ పగలబడి నవ్వుకుని "చాలా ఆసక్తికరమైన ప్రశ్న" అంటూ అదిరిపోయే సమాధానం సమాధానం యిచ్చారు. 
sayraa chiranjeevi lee  కోసం చిత్ర ఫలితం
"దేశభక్తి ఎక్కడైనా దేశభక్తే. తెల్లవారు, నల్లవారు అనే తేడా దానికి లేదు. ఈ చిత్ర నేపథ్యం స్వాతంత్ర సమరం. ఇంతటి గొప్ప సందర్భానికి దేశభక్తులకు, తెల్లవారిని చంపడానికి సైరా! కు నేను కూడా సాయం చేస్తున్నా"  అంటూ లీ సమాధానం ఇచ్చాడు. 
challenge chiranjeevi కోసం చిత్ర ఫలితం
చిరంజీవి 63వ జన్మదినం సందర్భంగా ఏపి హెరాల్డ్ తరపున ఆ మహనటునికి శుభాకాంక్షలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: