మెగాస్టార్ చిరంజీవికి నేడు 63 పుట్టిన రోజు.  ఈ సందర్బంగా ఆయనకు ఫ్యాన్స్, సెలబ్రెటీలు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అన్నయ్య చిరంజీవి ఇంటికి తన భార్యా లెజెనోవా, పిల్లలతో కలిసి వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.  ఇద్దరూ కలసి భోజనం చేయనున్నారు.

పవన్ రాకతో చిరు ఇల్లు మరింత సందడిగా మారింది.  గతంలో చిరంజీవి, పవన్ కళ్యాన్ మద్య విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి.  అయితే చిరంజీవి షష్టిపూర్తి సందర్భంగా మళ్లీ ఇద్దరు అన్నదమ్ములు కలిశారు.  ఆ తర్వాత సర్ధార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సెట్స్ కి చిరంజీవి వెళ్లి సందడి చేయడం..ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేసి తమ్ముడి గురించి గొప్పగా పొగటం జరిగింది.

పవన్ కళ్యాన్ సైతం రాంచరణ్ నటించిన రంగస్థలం ఈవెంట్ కి వెళ్లి సందడి చేయడంతో మెగా ఫ్యామిలీ ఎప్పటికీ కలిసే ఉంటుందని నిరూపించారు.  అన్నదమ్ములిద్దరూ ఒకే చోట చేరడంతో, మెగా అభిమానుల ఆనందం రెట్టింపయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: