విజయ దేవర కొండ పెళ్లి చూపుల తో మంచి హిట్ కొట్టి అందరీ దృష్టి లో పడ్డాడు అయితే ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ అవ్వడం తో విజయ దేవరకొండ రేంజ్ ఒక్క సారిగా పెరిగి పోయింది. దీనితో అతని తో సినిమాలు చేయడం కోసం అందరు ఎగ బడుతున్నారు. తాజాగా గీత గోవిందం సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌తో మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు విజయ్ దేవరకొండ. 

Image result for vijay devarakonda

డిఫెరెంట్ నటనతో ఇప్పుడున్న యువ హీరోలలోనే నెంబర్ ఒన్‌గా నిలుస్తున్నాడు విజయ్. ఇలా కెరీర్ మొదట్లోనే మంచి పేరు తెచ్చుకున్న విజయ్‌కు కళ్ళు చెదిరే ఆఫర్ మరొకటి వచ్చిందట. తెలుగు బుల్లి తెరపై అతిపెద్ద రియాలిటీ షోగా నడుస్తున్నది బిగ్ బాస్. ఈ షోకు మొదట్లో ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఇప్పుడు రెండవ షోకు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Image result for vijay devarakonda

అయితే బిగ్ బాస్ 3 కోసం ఇప్పటికే విజయ్ దేవరకొండను నిర్ణయించేశారట. మొదట్లో బిగ్ బాస్ షోలో 2వ ఎపిసోడ్‌కు నానికి బదులు విజయ్‌ను అడిగారట. అయితే గీత గోవిందం సినిమాలో బిజీగా ఉండటంతో రానని తేల్చేశారట విజయ్. కానీ ఇప్పుడు మూడవ షోలో తాను హోస్ట్‌గా వెళ్ళేందుకు సిద్థంగా ఉన్నట్లు విజయ్ చెప్పారట. మూడవ షోకు హోస్ట్‌గా విజయ్ దేవరకొండ వస్తే ఆ షోకు ప్రజల నుంచి మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: