బాలీవుడ్ అందాల తార ప్రియాంక చోప్రా అమెరికా సింగర్ నిక్ జోనాస్ తో ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే. రీసెంట్ గా వీరి నిశ్చితార్ధం కూడా జరిగిపోయింది. ఇక్కడ అమ్మాయి.. అక్కడ అబ్బాయి.. కలిసి ఇచ్చిన రిసెప్షన్ కి పెద్ద ఎత్తున సెలబ్రిటీలు కూడా తరలివచ్చారు. దీంతో రిసెప్షన్ అంతా పెద్ద పండుగలా జరిగింది.


ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ లీక్ చేసింది. అల్లుడు నిక్ జోనాస్ నిశ్చితార్ధంలో ఫుల్ గా హడావుడి చేశాడట. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ సెంటర్  ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడట. అంతేకాదండోయ్ సంస్కృత మంత్రాలను కూడా నోటితో ముద్దు ముద్దుగా.. సారీ.. సారీ.. ముద్ద ముద్దగా పలికాడట.   


కేవలం నిక్ జోనాస్ మాత్రమే కాదు.. ఆయన తల్లిదండ్రులు డెనిస్ మిల్లర్, పాల్ కెవిన్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారని ప్రియా తల్లి మధు చెప్పుకొచ్చారు. వారికి భారతీయ సంప్రదాయాలు కొత్తగా ఉన్నా కూడా చాలా ఎంజాయ్ చేశారట. పురోహితుడు చెప్పినట్లు వింటూ అన్నీ కరెక్ట్ గా చేశారని మధు చోప్రా చెప్పారు. నిక్ ఫ్యామిలీ చాలా చాలా మంచిదని చెప్పుకొచ్చారు. 


తమ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నిక్ తెగ నచ్చేశాడట. మంచి సింగరే కాదు వెల్లీ డెవలప్డ్ మైండ్ సెట్ తన అల్లుడి ప్రత్యేకత అని మధు చోప్రా మురిసిపోతున్నారు. పెద్దలంటే చాలా గౌరవం ప్రదర్శిస్తున్నాడని కాబోయే అల్లుడిని తెగ మెచ్చేసుకున్నారు. ఇక పరిణీతి చోప్రా కూడా రెస్పాండ్ అయింది. నిక్ జోనాస్.. ప్రియాంకకు కరెక్ట్ మొగుడని అని చెప్పుకొచ్చింది. ఆయన కంటే మంచి భర్తకు ప్రియాంకకు దొరకడని అభిప్రాయపడింది.



మరింత సమాచారం తెలుసుకోండి: