రెండురోజుల క్రితం విడుదలైన ‘సైరా’ టీజర్ మిలియన్స్ సంఖ్యలో వ్యూస్ సాధిస్తూ తన ప్రభంజనాన్ని కొనసాగిస్తూ ఉంటే ఈటీజర్ కు వస్తున్న స్పందన ఒకవిషయంలో రామ్ చరణ్ కు పూర్తిసంతృప్తి కలిగించలేదు అన్నవార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం వరకు ‘సైరా’ మూవీని నేషనల్ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని అత్యంత భారీస్థాయిలో నిర్మిస్తూ ఈమూవీని బాలీవుడ్ లో కూడ డబ్ చేసి అక్కడ కూడ భారీ మార్కెట్ చేయాలని చరణ్ భావించాడు. దీనికోసమే మొదట్లో 100కోట్ల సినిమాగా ప్రారంభమైన ‘సైరా’బడ్జెట్ ను 150కోట్ల పై స్థాయికి తీసుకువెళ్ళిపోయాడు చరణ్. 
First look of Sye Raa Narayana Reddy
ఈమూవీకి బాలీవుడ్ మార్కెట్ బాగ రావాలి అన్నఉద్దేశ్యంతో ఈమూవీలో ఒక కీలకపాత్రలో అమితాబ్ ను కూడ నటింప చేస్తున్నారు. అయితే ‘సైరా’ టీజర్ కు మన తెలుగు రాష్ట్రాలలో అదేవిధంగా తెలుగు మీడియాలో వచ్చినంత ప్రాధాన్యత బాలీవుడ్ మీడియాలో రాలేదు అని ప్రాధమికంగా వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ‘సైరా’ ను డబ్ చేసి విడుదల చేయబోతున్న తమిళ కన్నడ మళయాళ భాషల మీడియాలో కూడ ‘సైరా’ టీజర్ విడుదలకు సంబంధించిన వార్తలు పెద్దగా అక్కడ ప్రసారంకాకపోవడం కొంతవరకు చరణ్ కు షాక్ ఇచ్చింది అన్నవార్తలు వస్తున్నాయి. 
A still from the biopic
ఈమూవీని జాతీయస్థాయి మూవీగా మార్చాలి అన్నఉద్దేశ్యంతో చరణ్ ఈసినిమాలోని కీలకపాత్రలకు బాలీవుడ్ కోలీవుడ్ శాండిల్ వుడ్ నటీనటులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.  దీనికితోడు అంతర్జాతీయ స్థాయి టెక్నిషియన్స్ ను కూడ ఈమూవీకి వినియోగిస్తున్న నేపధ్యంలో ఈమూవీ బడ్జెట్ చివరకు ఏరేంజ్ కి చేరుతుంది అన్నవిషయమై ప్రస్తుతానికి చరణ్ కు కూడ క్లారిటీ లేదని వార్తలు వస్తున్నాయి. అందువల్లనే ‘సైరా’ టీజర్ విడుదల రోజున చరణ్ ఈమూవీ బడ్జెట్ పై క్లారిటీ ఇవ్వలేకపోయాడు అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. 
megastar chiranjeevi 151 movie first look motion poster
ఇలాంటి పరిస్థుతులలో ‘సైరా’ టీజర్ కు అనూహ్య స్పందన తెలుగు ప్రేక్షకుల నుండి వస్తున్నా మనపొరుగు రాష్ట్రాలైన కోలీవుడ్ శాండీల్ వుడ్ మాలీవుడ్ నుండి ఆశించిన స్థాయిలో ‘సైరా’ టీజర్ కు క్రేజ్ ఏర్పడకపోవడం చరణ్ కు షాకింగ్ గా మారింది అని టాక్. దీనికితోడు ఈటీజర్ విడుదల విషయానికి సంబంధించిన వార్తలు బాలీవుడ్ మీడియా అసలు పట్టించుకోకపోవడం మరింత షాకింగ్ గా మారింది అంటున్నారు. దీనితో ‘సైరా’ బడ్జెట్ గురించి చరణ్ ఆలోచనలలో మార్పులు వచ్చినా ఆశ్చర్యం లేదు అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: