‘బిగ్ బాస్ 2’ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాని తీరు పై స్టార్ మా యాజమాన్యం కూడ అసంతృప్తిగా ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ప్రస్తుతం నాని బిజీ అని అంటున్నారు. నాని నాగార్జునతో నటిస్తున్న ‘దేవదాస్’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపధ్యంలో ఆసినిమా షూటింగ్ పనులతో బిజీ అయిన నాని ‘బిగ్ బాస్ 2’ షోలో జరుగుతున్న ఏవిషయాన్ని మనసు పెట్టి పరిశీలించలేక పోతున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. 
Bigg Boss 2 Telugu: Nani’s show tops the TRP ratings
ఈషోలో ప్రసారం అయ్యే అన్ని విషయాలను పరిశీలించి తనకు ఒక ఫీడ్ బ్యాక్ ఇమ్మని నాని ఒక ప్రత్యేకమైన టీమ్ ను ఎంగేజ్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ఈటీమ్ ఇచ్చే ఫీడ్ బ్యాక్ అనుగుణంగా ప్రతి వీకెండ్ లోను ప్రసారం అయ్యే కార్యక్రమంలో నాని కామెంట్స్ ఉంటున్న నేపధ్యంలో ఒక స్క్రిప్ట్ ను చదువుతున్న వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా నానితీరు మారిపోయిందని స్టార్ మా యాజమాన్యం గుర్తించినా ఇప్పుడు ఏమిచేయలేని పరిస్థితి అని అంటున్నారు.
Bigg Boss 2 Telugu,Bigg Boss 2 Telugu June 16 update,Bigg Boss 2 Telugu Nani
వాస్తవానికి బుల్లితెర ‘బిగ్ బాస్ 2’ కార్యక్రమం ద్వారా నాని తన ఇమేజ్ ని పెంచుకోవాలని ఈకార్యక్రమానికి పారితోషికం తక్కువైనా అంగీకరించాడు అన్న వార్తలు ఉన్నాయి. అయితే ఈషో పై సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ కామెంట్స్ ను పరిశీలించి తనకు తానుగా ‘బిగ్ బాస్’ హోస్ మేట్స్ పై ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకోకుండా కేవలం ప్రిపేర్ చేసిన స్క్రిప్ట్ ను చదివే వ్యక్తిగా నాని యాంకరింగ్ మారిపోవడం బిగ్ బాస్ షో నిర్వాహకులకు కూడ షాక్ ఇస్తున్నట్లు సమాచారం. 
nani will be hosting Bigg Boss telugu 2
దీనికితోడు ‘బిగ్ బాస్ 2’ షో ఎలిమినేషన్ కు సంబంధించి లీకులను అరికట్టడానికి ఈ ఎలిమినేషన్ షోను ప్రతి శనివారం ఉదయానికి బదులు ప్రతి శనివారం సాయంత్రం ఆలస్యంగా మొదలు పెడుతూ ఉండటంతో టైమ్ తక్కువైన నేపధ్యంలో ఈఎలిమినేషన్ షో రికార్డింగ్ ను చాల హడావిడిగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు ‘బిగ్ బాస్ 2’ టీమ్ కు నానీకి మధ్య ఈకార్యక్రమానికి సంబంధించి చిన్న గ్యాప్ ఏర్పడిందని ఆ గ్యాప్ బయటకు కనపడని ఇగో లుగా మారడంతో అన్నీ కలిసి నాని హోస్టింగ్ పై ప్రభావం చూపెడుతోంది అని అంటున్నారు. ఏమైనా నానీకి ఈషో వల్ల పెరిగిన ఇమేజ్ మాత్రం ఏమిలేదు అన్న కామెంట్స్ లో స్పష్టత కనిపిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: