ప్రభాస్ ఏవిషయాన్ని అంతగా సీరియస్ గా తీసుకోదని అతడి సన్నిహితులు చెపుతూ ఉంటారు. ‘బాహుబలి’ తో నేషనల్ స్టార్ గా ప్రభాస్ మారిపోయినా తన సినిమాల నిర్మాణ విషయంలో అదేవిధంగా తన సినిమాలకు సంబంధించిన నిర్ణయాల విషయంలో ప్రభాస్ ఎక్కడా స్పీడ్ ను ప్రదర్శించడు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ‘సాహో’ సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతుంది అని వార్తలు వస్తున్నా ఇప్పటికీ ఆ రిలీజ్ డేట్ విషయంలో ఈమూవీ నిర్మాతలు స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.
Prabhas updated his Facebook cover with his latest look for Saaho. Photo: firdaus_prabhas_fan/Instagram
ఈ పరిస్థుతుల నేపధ్యంలో ప్రభాస్ తన సినిమాల వేగం పెంచాలని తన పెదనాన్న కృష్ణంరాజు నిర్మాణ సంస్థలో జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమాకు లైన్ క్లియర్ చేయడం ఆసినిమా ఆగష్టులో ప్రారంభం అవుతుంది అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. యూరప్ లో చిత్రీకరించే ఈమూవీ స్వాతంత్రం రాకముందు ఆనాటి కథ ఈమూవీలో భవిష్యత్ ముందుగానే చెప్పే వ్యక్తి పాత్రలో ప్రభాస్ నటించబోతున్నాడు. 
Prabhas is winning hearts with his sweet gestures
ఈసినిమాకు సంబంధించి హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపిక కూడ పూర్తి అయి స్క్రిప్ట్ కూడ పూర్తి అయి షూటింగ్ కు రెడీ అయిపోయిన తరువాత ఆఖరి నిముషంలో ఈసినిమా ప్రారంభం ప్రభాస్ సూచనలు మేరకు వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీనితో స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారా లేదంటే ‘సాహో’ షూటింగ్ మరింత వేగంగా పూర్తి చేయడానికి ఈమూవీని ప్రస్తుతానికి నిలిపి వేసారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

కారణాలు ఏమైనా ప్రభాస్ తన తీరు మార్చుకుని వేగంగా సినిమాలు చేసి వచ్చే ఏడాది ప్రభాస్ వైపు నుంచి రెండు సినిమాలు విడుదల ఉంటుంది అని ఆశలు పెట్టుకున్న అభిమానులకు ఈన్యూస్ షాకింగ్ గా మారింది. వాస్తవానికి ప్రతి విషయంలోనూ అంతా రెడీ అయిపోయిన ఈమూవీ విషయంలో చివరినిముషంలో ప్రభాస్ ఆలోచనలు మారడం వెనుక గల కారణాలు ఒక్క కృష్ణంరాజుకు తప్ప మరెవ్వరికీ తెలియదు అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: