మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన టీజర్ అంచనాలు పెంచేసింది. స్వతంత్ర యోధుడుగా మెగాస్టార్ చిరంజీవి సరికొత్త ఎనర్జీతో కనిపిస్తున్నాడు. 


టీజర్ లో కనిపించిన రెండు, మూడు షాట్స్ లో చిరు తన గ్రేస్ చూపించాడు. అయితే చిరు పరంగా చూస్తే ఈ సినిమా మరో సెన్సేషన్ అనేలా ఉన్నా దర్శకుడు సురేందర్ రెడ్డి మీద అందరు డౌట్ పడుతున్నారు. కమర్షియల్ సినిమాలు తీసి హిట్ కొట్టిన అనుభవం తప్ప సూరికి ఇలాంటి సోషియో ఫ్యాంటసీ మూవీ అసలు అలవాటు లేదు.


కమర్షియల్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి మొదటిసారి ఇంత భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. అయితే ఇది చరిత్ర ఎవరు తీసినా హిట్ కొట్టొచ్చు. కాని ఇదే సినిమా రాజమౌళి డైరక్షన్ లో వస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. బాహుబలితో ఓ కల్పిత కథనే అద్భుతంగా తెరకెక్కించిన జక్కన్న ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిని ఎలా తీస్తాడో చెప్పొచ్చు. 


అయితే సైరా ఛాన్స్ ముందు రాజమౌళికే ఇచ్చారట. రాజమౌళి దాన్ని సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తుంది. బాహుబలి కోసం 5 ఏళ్లు పట్టింది. సైరా మెగా ఫ్యామిలీ చెప్పినట్టుగా రెండేళ్లలో పూర్తి చేయడం కుదరదని చెప్పాడట. అందుకే సైరా రాజమౌళి చేతుల్లో నుండి సూరి చేతుల్లోకి వచ్చింది. మరి ఈ సైరాతో సూరి ఎలా తన సత్తా చాటుతాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: