తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి వారసులుగా ఎంతో మంది హీరోలు ఇంట్రడ్యూస్ అవుతున్నారు.  ‘అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాన్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు.  ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు..ఆ తర్వాత రెండు మూడు చిత్రాలు కూడా పవన్ కి పెద్దగా పేరు తీసుకు రాలేదు.  ఇక తొలిప్రేమ, సుస్వాగతం,తమ్ముడు, బద్రి చిత్రాలతో పవన్ రేంజ్ ఒక్కసారే పెరిగిపోయింది.  అయితే అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి చిత్రంలో హీరోయిన్ గా అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ యార్లగడ్డ నటించారు. 

ఆ తర్వాత మరే చిత్రాల్లోకూ సుప్రియ కనిపించలేదు.  సినీ బ్యాగ్ గ్రౌండ్ ఉన్నా సుప్రియ మాత్రం తర్వాత ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు.  చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత ‘గూఢచారి’ చిత్రంలో రీ ఎంట్రీ ఇచ్చారు సుప్రియ.   ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తోంది సుప్రియ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుప్రియ మాట్లాడుతూ..పవన్ తో నటించిన సమయంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. 

నేనెప్పుడూ హీరోయిన్ అవ్వాలని అనుకోలేదు… తెర వెనుక ఉండడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేదానిని… కానీ అనుకోకుండా పవన్ కళ్యాణ్ తో నటించే ఛాన్స్ వచ్చింది. అదే నాకు మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఇండస్ట్రీకి కొత్త కావడంతో పవన్ కళ్యాన్ చాలా సిగ్గుపడేవారు..ఆయన చాలా సున్నితమైన మనస్థత్వం కలిగిన వారు.  కొన్ని సన్నివేశాల్లో ఆయన కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని నటించేవారు..ఆ సమయంలో నాకు ఆయన ఎక్స్ ప్రెషన్స్ అస్సలు అర్థం అయ్యేవి కావు..దాంతో ఆ గ్లాసెస్ తీయాలని గొడవపడేదాన్ని. 
Related image
ఆ సినిమాలో పవన్ చేతులపై నుంచి కారు వెళ్లే దృశ్యం గురించి అందరికీ తెలిసిందే..అయితే అది ఏ డూప్ తోనే లేదా కెమెరా ట్రిక్స్ తోనే చేస్తారనుకున్నా..కానీ నిజంగా పవన్ రియల్ స్టంట్ చూసిన తర్వాత నా కళ్లలో నీళ్లు అస్సలు ఆగలేదు..ఒక్కసారే ఏడుపు వచ్చిందని అన్నారు.  పవన్ ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డారని సుప్రియ అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: