టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అక్కినేని దాసరిల కాంబినేషన్ లో వచ్చిన  సినిమాలు ఒక చరిత్ర.  వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఘన విజయంతో పాటు వీరిద్దిరి మధ్య స్నేహం కొన్ని సంవత్సరాలు పాటు కొనసాగింది. అయితే ఒక చిన్న విషయంలో ఏర్పడిన భేధాభిప్రయాలు వీరిమధ్య దూరాన్ని పెంచడమే కాకుండా అక్కినేని దాసరిల మధ్య కనీసపు పలకరింపులు కూడ లేకుండా చేసింది అని అంటారు.
 Supriya
అంతేకాదు దాసరి సతీమణి మరణించినప్పుడు అక్కినేని కనీసం ఫోన్లో పరామర్శ కూడ చేయులేదు అన్నవార్తలు అప్పట్లో హడావిడి చేసాయి. పవన్ కళ్యాణ్ తో తనతోలి సినిమాలో నటించి ఆతరువాత సుమారు 22సంవత్సరాల తరువాత తిరిగి ‘గూఢచారి’ సినిమాతో మళ్ళీ ఇండస్ట్రీ లోకి  రీ ఎంట్రీ ఇచ్చిన అక్కినేని మనమరాలు సుప్రియ ఈమధ్య ఒక ప్రముఖ ఛానల్ కోసం అలీ నిర్వహించే టాక్ షోకి అతిథిగా వచ్చింది. ఈసందర్భంలో అలీ అడిగిన ఒకప్రశ్నకు సమాధానం ఇస్తూ అక్కినేని దాసరిల మధ్య మరింత గొడవలు మరింత ముదరడానికి తాను కూడా ఒక కారణం అన్న విషయాన్ని బయటపెట్టింది. 
Supriya Yarlagadda
తాను పద్దెనిమిదేళ్ల వయసులో అన్నపూర్ణ  స్టూడియో బాధ్యతలు చేపట్టానని అప్పట్లో అన్ని విషయాల్లోనూ కఠినంగా ఉండేదానినని  అన్న విషయాలను  వివరిస్తూ   పెద్దవాళ్ల విషయంలో ఎలా మాట్లాడాలో అప్పట్లో తనకు అంతగా తెలిసేదికాదని ఈనేపధ్యంలో అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన దాసరి మూవీ  షూటింగ్ కు సంబంధించి  కొన్ని బిల్లుల విషయంలో  కఠినంగా  వ్యవహరించడంతో  అది అప్పట్టికే ఉన్న  దాసరి అక్కినేని మధ్య విభేదాల్ని పెంచటమే కాకుండా చివరకు వారిద్దరూ  ఒకేసభకు హాజరైనా ముఖముఖాలు చూసుకోవటానికి కూడా ఇష్టపడని స్థితికి చేరుకోవడానికి ఒకవిధంగా తానూ పరోక్షంగాకారణం అంటూ సంచలన విషయాలను బయటపెట్టింది సుప్రియ. 
Supriya Yarlagadda
ఇదేసందర్భంలో సుప్రియ మరోవిషయం వెల్లడిస్తూ  దాసరి మరణించటానికి ఏడాది ముందు ఆయనతో తనకో అవసరం ఏర్పడిని విషయాన్ని వివరిస్తూ అర్థరాత్రి 12గంటల సమయంలో తాను దాసరి ఇంటికి వెళ్లినట్లుగా సుప్రియ వివరించింది. అంతేకాదు దాసరి ఇంటిలోపలకు వెళ్లిన తర్వాత తాను ఏమీ మాట్లాడకుండా నిలబడిపోయానని  అప్పుడు దాసరి తనను చూసి ‘వచ్చావా అక్కినేని నాగేశ్వరరావుగారి మనమరాలంటే ఆమాత్రం పొగరుండాలిలే కూర్చో’ అంటూ అభిమానంగా పలకరించడమే కాకుండా ఏమైనా  తింటావా అని అని అప్యాయంగా అడిగి తనసమస్యను పరిష్కరించిన విషయాన్ని బయటపెట్టింది ఈఅక్కినేని మనమరాలు. దాసరి మంచితనాన్ని చెప్పే ప్రయత్నంలో అలీ షోలో సుప్రియ చెప్పిన మాటలు ఆరోజు ప్రసారం అయిన కార్యక్రమానికి హైలెట్ గా మారాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: