ఈ మద్య హీరో, హీరోయిన్లు ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తున్నారు.  ఈ నేపథ్యంలో రవితేజ ‘రాజా ది గ్రేట్’ చిత్రంలో పూర్తిగా అందుడిగా నటించాడు. రాంచరణ్ ‘రంగస్థలం’చిత్రంలో పూర్తిగా చెవిటి వాడి పాత్రలో నటించారు..గతంలో కొంత మంది హీరోలు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.  తాజాగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన ఓ హీరోయిన్‌ ఇప్పుడు రోడ్డు మీద కూరగాయలు అమ్ముతున్నారు. రోడ్డు పక్కన బాగా మాసి, చినిగిన చీరకట్టుకొని నిద్రలేమితో, అలసిపోయినట్టుగా కనిపిస్తూ అభిమానులకు షాక్‌ ఇచ్చారు. 
Image result for adah sharma
అదేంటీ హీరోయిన్ మరీ అంత దీన స్థితిలో ఉండటం ఏంటా అని అనుకుంటున్నారా. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఈ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా..పూరి జగన్నాధ్, నితిన్ కాంబినేషన్ లో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ చిత్రంలో పరిచయం అయిన అందాల భామ అదా శర్మ.   తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి, గరమ్‌ లాంటి సినిమాల్లో కనిపించిన అదా.. హీరోయిన్‌గా స్టార్‌ ఇమేజ్‌ను మాత్రం అందుకోలేకపోయారు.
Image result for adah sharma
  ఆ మద్య అడవి శేషు హీరోగా నటించిన ‘క్షణం’ మంచి సక్సెస్ అయినా ఈ అమ్మడికి మాత్రం పెద్దగా పేరు రాలేదు. టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పేసి బాలీవుడ్‌ బాట పట్టారు. ఇటీవల ఎక్కువగా ఫొటోషూట్స్‌తోనే కాలం గడిపేస్తున్న ఈ బ్యూటీ త‍్వరలో ఓ హాలీవుడ్‌ సినిమాలో నటించనున్నారు.  ప్రస్తుతం అదా కూరగాయలమ్ముతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: