ఈ మద్య సినిమాల ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ అభిజిత్ షిండే ఆత్మహత్య చేసుకున్న వార్త మరువక ముందే మరో నటుడు అనారోగ్యంతో కన్నుమూశాడు. ప్ర‌ముఖ ఒరియా న‌టుడు డెబుబోస్ అనారోగ్యంతో క‌న్నుమూసారు.  ఆగ‌స్ట్ 22న హైద‌రాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్ లో ఈయ‌న మ‌ర‌ణించారు. 75 ఏళ్ల డెబుబోస్ 130కు పైగా ఒరిస్సా.. బెంగాలీ సినిమాల్లో న‌టించారు. డెబుబోస్  కి  గ‌తంలో రెండుసార్లు హార్ట్ ఎటాక్ కూడా వ‌చ్చింది.
Image result for debu bose
ఈ సారి ఆరోగ్యం విష‌మించ‌డంతో ఆయ‌న్ని కాపాడ‌లేక‌పోయామ‌ని చెప్పారు వైద్యులు. 1942లో జ‌న్మించిన ఈయ‌న 1980లో త‌ప‌స్య సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. నాలుగు ద‌శాబ్దాలుగా ఇండ‌స్ట్రీలో ఉన్న డెబుబోస్ 130 సినిమాల‌తో పాటు చాలా వ‌ర‌కు వెబ్ సిరీస్ మ‌రియు సీరియ‌ల్స్ లోనూ న‌టించారు.
Image result for debu bose
పూరా మారా కాలా త‌ప్కురా, కి హుబా సుయ్ పోసిలే, సామే ఖేలుచ్చి చేక భానూరి, సునా ఛేదాయ్, ఫూలా చాందనా లాంటి సినిమాల్లో న‌టించారు బోస్.  2014లో రాస్తా సినిమాలో స్క్రీన్ పై క‌నిపించారు.  కేవలం నటుడిగానే కాకుండా మంచి డ్యాన్సర్ గా ఆయన తన ప్రతిభ నిరూపించుకున్నాడు. ఆయ‌న మృతికి ఒరిస్సా, బెంగాలి చిత్ర ప‌రిశ్ర‌మ‌లు త‌మ సంతాపాన్ని వ్య‌క్తం చేసాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: