సినిమా హీరోగా మారాలి అని కలలు కన్న విజయ్ దేవరకొండ కోరికతీరడమే కాకుండా ఈ మధ్య కాలంలో ఏయువనటుడికి రానంత క్రేజ్ రావడంతో ప్రస్తుతం ఇతడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాడు. మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో సైతం  విజయ్  లేటెస్ట్  మూవీ గీతాగోవిందాన్ని తన ఖైదీ మూవీతో పోల్చడంతో ఇప్పడు టాప్ దర్శకులు దృష్టి  అంతా ఈ యంగ్ హీరో పై ఉంది.
Nani-Not-Into-40-–-Vijay-Deverakonda-Racing-Into-50-Cr
అయితే ఊహించని స్థాయిలో వచ్చిన ఈ క్రేజ్ ను చూసి పొంగిపోకుండా తనకు ఎటువంటి బిరుదులూ ట్యాగ్ లు వద్దు అంటూ విజయ్ దేవరకొండ తాను అందరి టాప్ హీరోల అభిమానిని అంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ టాప్ హీరోల అభిమానులను కూడ తన అభిమానులుగా మార్చుకుంటూ విజయ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ఇది ఇలా ఉండగా ఈ హీరో లేటెస్ట్ గా మహేశ్ బాబుతో  తాను తీయించుకున్న  ఫోటోను ట్వీట్ చేసి మహేష్ అభిమానుల అభిమానాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాడు.  
Vijay Devarakonda 
అంతేకాదు ఒకప్పుడు తాను మహేష్  బాబు సినిమా టికెట్ల కోసం ఫైటింగ్ చేసేవాడినని,ఇప్పుడు అదే మహేష్  బాబు నటిస్తున్న 'మహర్షి' షూటింగ్  సెట్ లో  మహేష్ ను కలవడమే కాకుండా  ఆయన చేస్తున్న సినిమా గురించి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది అంటూ విజయ్ తన ట్విటర్ లో చేసిన కామెంట్స్ మహేష్ అభిమానులకు బాగా కనెక్ట్ అవుతున్నారు.
vijay devarakonda taxi wala teaser Latest 2018 - Sakshi
ఇది ఇలా ఉండగా  ప్రస్తుతం 29వ సంవత్సరంలో ఉన్న విజయ్ ఒకప్పుడు తనకు 40 ఏళ్ళు వచ్చేవరకు పెళ్లి చేసుకోకూడదని భావించానని, అయితే “గీత గోవిందం” సినిమా ప్రభావమో ఏమో గానీ, తనకు 35 ఏళ్ళు వచ్చే సమయానికి పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నట్లు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. అయితే తన మైండ్ సెట్ కు పెద్దలు కుదిర్చిన వివాహం సరిపోదంటూ ఎప్పటికైనా ప్రేమ వివాహమే చేసుకుంటానని అంటూ ఈ క్రేజి యంగ్ హీరో తన పెళ్లి గురించి కూడా లీకులు ఇస్తున్నాడు. ఈ నేపధ్యంలో చాలా మంది అమ్మాయిలు విజయ్ ని ప్రేమలోకి దింపే  తమ ప్రయత్నాలు చాలా ఏళ్ళు కొనసాగించే అవకాసం ఉంది..



మరింత సమాచారం తెలుసుకోండి: