కొంతకాలం క్రితం నాగశౌర్య నిహారికలు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తల హడావిడి జరిగింది. సరిగ్గా ఆవార్తలు హడావిడి చేస్తున్న సమయంలోనే నాగశౌర్య ‘ఛలో’ మూవీ ఫంక్షన్ కు అతిథిగా చిరంజీవి వెళ్ళడంతో ఆవార్తలు మరింత బలపడ్డాయి. ఆతరువాత ఆవార్తలను నాగశౌర్య నిహారికలు ఖండించారు. 
Naga Shaurya and Kashmira Paradeshi
అయితే చిరు పుట్టినరోజు అయినా మరిఏవిషయం అయినా నాగశౌర్య ప్రత్యేకమైన అభిమానం కురిపిస్తు మెగా కాంపౌండ్ పై తన అభిమానాన్ని కొనసాగిస్తూనే ఉన్నడు. ‘ఛలో’ ప్రీరిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవిని ఆహ్వానించి ఆయన  ఆశీస్సులు తీసుకొని ఘనవిజయం సాధించడంతో  శౌర్య దాన్ని సెంటిమెంట్ గా భావించి నిన్నజరిగిన  ‘@నర్తనశాల’ చిత్రం  ప్రీరిలీజ్ ఫంక్షన్ కు రామ్ చరణ్ ను అతిథిగా ఆహ్వానించాలనుకున్నాడు. 

చరణ్ తన బిజీ షెడ్యూల్స్ కారణంగా ఆఫంక్షన్ కు రాలేను అని చెపుతూ శౌర్యను తనదగ్గరకు పిలిపించుకుని సుమారు గంటసేపు భేటీ అయ్యాడు అన్నవార్తలు వస్తున్నాయి. ఒకఫంక్షన్ కు పిలిచినప్పుడు రాలేను అని చెప్పగలిగిన చరణ్ ఈవిషయాన్ని నాగశౌర్యకు వివరించడానికి తన బిజీ షెడ్యూల్ పక్కకుపెట్టి నాగశౌర్యతో ఒకగంట ఏకాంతంగా కలవడమే కాకుండా ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు అభిమానం కురిపించుకొని పలువిషయాల పై చర్చించుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అన్నకోణంలో ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. 
First Look Of Narthanasala Launched
నిన్నజరిగిన ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాగశౌర్య ఆశ్చర్యకరంగా మరో సెంటిమెంట్ ను ఫాలో అయ్యాడు. విడుదల కాబోతున్న ఒకమూవీకి సంబంధించి ప్రీరిలీజ్ ఫంక్షన్ జరిగినప్పుడు ఆసినిమాకు సంబంధించిన ధియేట్రికల్ ట్రయిలర్ విడుదల చేయడం సర్వసాధారణమైన విషయం. అయితే ఈపద్ధతిని అనుసరించకుండా ‘మహానటి’, ‘గీత గోవిందం’ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు నాగశౌర్య కూడ అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతూ నిన్నజరిగిన తన మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో ‘@నర్తనశాల’ సినిమాకు సంబంధించి ట్రయిలర్ విడుదల చేయకుండానే జస్ట్ వాచ్ ఫుల్ మూవీ ఇన్ థియేటర్స్ అంటూ స్లయిడ్ వేసి సర్ప్రయిజ్ చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. దీనితో నాగశౌర్య తన మూవీ విజయం కోసం మెగాకాంపౌండ్ ‘గీత గోవిందం’ సెంటిమెంట్స్ ను బాగానే ఫాలో అయ్యాడు అంటూ నిన్నటి ఫంక్షన్లో కామెంట్స్ వినిపించాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: