రామ్ చరణ్ బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న తన లేటెస్ట్ సినిమా పై అనుసరిస్తున్న వ్యూహాలు చరణ్ అభిమానులకు తీవ్రఅసంతృప్తిని కలిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అదేతరహా మరోబ్లాక్ బస్టర్ ను అభిమానులు చరణ్ బోయపాటిల కాంబినేషన్ నుండి ఆశిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఈసినిమా పై భారీస్థాయిలో ఖర్చుకూడ చేస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజున చరణ్ కొత్త సినిమా టైటిల్‌ ఫస్ట్‌ లుక్‌ వస్తాయని అనుకున్నారు కానీ అలాజరగలేదు. 
Ram Charan
చిరంజీవి పుట్టినరోజును కేవలం ‘సైరా’ ప్రమోషన్స్‌ కి మాత్రమే చరణ్‌ వినియోగించుకున్నాడు కానీ తనలేటెస్ట్ సినిమా విషయాలను చరణ్ సైడ్ లైన్ చేయడం చరణ్ అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి చరణ్ బోయపాటిల మూవీ సంక్రాంతికి విడుదల కావలసి ఉంది. వచ్చే ఏడాది ఉగాదికి రాబోతున్న మహేష్ వంశీ పైడిపల్లిల ‘మహర్షి’ టైటిల్ ఏనౌన్స్ చేయడమే కాకుండా ఫాస్ట్ లుక్ టీజర్ ను కూడ విడుదలచేసిన నేపధ్యంలో మరో నాలుగు నెలలలో రాబోతున్న సంక్రాంతిని చరణ్ తన సినిమా విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదు అని చరణ్ అభిమానుల ఆవేదన.
Ram Charan makes a statement to producers about sharing collection figures of a film
తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ టైటిల్ ఫిక్స్ చేయడం ఒక సమస్యగా మారింది అని టాక్. ‘రంగస్థలం’ తరువాత విడుదల అయ్యే మూవీ కావడంతో ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకుని అందరికీ కనెక్ట్ అయ్యే టైటిల్ కోసం బోయపాటి చరణ్ ల ఆలోచనలు వల్ల ఆలస్యం జరుగుతోందని సమాచారం. 
ram-charan-non-bearded-look-from-feb-last-week
గతంలో 'ఖైదీ నంబర్‌ 150' టైమ్‌ లో చరణ్‌ ఇలాగే వ్యవహరించి తన ‘ధృవ’ చిత్రాన్ని తెలుగు సినిమాలకు సంబంధించి చెప్పుకోతగ్గ సీజన్ కాని డిసెంబర్ లో విడుదల చేసి ఆమూవీకి టాక్ బాగా వచ్చినా కలక్షన్స్ విషయంలో చరణ్ వెనకపడ్డాడు అన్న కామెంట్స్ అప్పట్లో వచ్చాయి. దీనితో  తన తండ్రి చేస్తున్న సినిమాలతో పాటు చరణ్ తన సినిమాలకు కూడ సమ ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది అన్నఅభిప్రాయంలో చెర్రీ అభిమానులు ఉన్నారు. అయితే మెగా కాంపౌండ్ వ్యూహాలు చాలలోతుగా ఉంటాయి కాబట్టి ప్రస్తుతం చరణ్ అనుసరిస్తున్న వ్యూహాలలో ఎదోఒక కారణం ఉంది అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: