ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ మద్రాస్ లో ఉండేది.  ఇక తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ కి షిఫ్ట్ చేశారు.  ఇందుకోసం దాసరి నారాయణరావు, ఎన్టీఆర్, ఎఎన్ ఆర్, రామానాయుడు, కృష్ణ లాంటి వారు కృషి చేశారు.  ఎట్టకేలకు హైదారాబాద్ లో అత్యద్భుతమైన సినీ ఇండస్ట్రీ ఏర్పాటు చేశారు.  అయితే తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి సినిమా ఇండస్ట్రీ తరలిపోతుందని భావించారు..అందుకోసం అక్కడ భారీ ఎత్తున స్థలాలు కూడా తీసుకుంటున్నట్లు తెగ పుకార్లు వచ్చాయి. 

Image result for visakha beach

కానీ అది మాత్రం ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ కాలేదు..కాకపోత ఈ మద్య విశాఖ పట్టణం, భీమిలి పరిసర ప్రాంతాల్లో సినిమా ఇండస్ట్రీల నిర్మాణం ఏర్పాటుకు ఏపి ప్రభుత్వం సానుకూలంగా ఉందని..అక్కడ ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. గత కొంత కాలంగా  సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన మెగా ఫ్యామిలీకి సొంత సినీ స్టూడియో లేని లోటును పూడ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి.  

గంట మద్దతు...?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.  ఇందుకు సినీమా ఇండస్ట్రీలు ఉంటే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఫిల్మ్ స్టూడియోలు ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వం తరుపున రాయతీలు ఇస్తామనే హామీలు కూడా ఇస్తోంది.  ఈ నేపథ్యంలో వైజాగ్ బీచ్ రోడ్ ప్రాంతంలో రామ్ చరణ్ సొంత స్టూడియో నిర్మిచేందుకు ప్లాన్ చేస్తున్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి. 


 గతంలోనూ రామ్ చరణ్ హైదరాబాద్ సమీపంలో స్టూడియో నిర్మాణానికి భూమి కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి.మెగా ఫ్యామిలీకి మంత్రి గంట శ్రీనివాసరావు సపోర్ట్ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.  ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారు. మరో వైపు ‘సైరా' చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: