తెలుగు ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగు తొలి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా చేసుకొని తీస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. మెగాస్టార్ చిరంజీవి చిరకాల స్వప్నం అయిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ చిత్రానికి రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  చిరు పుట్టిన రోజుకి ఒక్కరోజు ముందు ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు.  ‘సైరా’ టీజర్ రిలీజ్ దగ్గర నుంచి సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తుంది.  అంతే కాదు ఈ చిత్రంలో పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నట్లు పరుచూరి బ్రదర్స్ టీజర్ రిలీజ్ ఈవెంట్ రోజు చెప్పారు.   
Image result for paruchuri brothers
‘సైరా నరసింహారెడ్డి’ టీజర్  లో ‘ఈ యుద్ధం ఎవరిది’ అని చిరు అంటే అతడి సైన్యం ‘మనది’ అంటుంది. అంతే బ్రిటీష్ ప్రభుత్వం పై ఏ రేంజ్ లో సమరశంఖారావం పూరించారో అర్థం అవుతుంది.  ఇదిలా ఉంటే..చిత్ర రచయితల్లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా నుంచి చాలా ముందుగానే ఒక కీలకమైన డైలాగ్ లీక్ చేయడం విశేషం. ‘‘చేతులు వెనక్కి విరిచి కట్టేశాం. ముఖం ముందు ఉరితాడు వేలాడుతోంది.

ఏంటిరా? ఆ ధైర్యం.. చావు భయం లేదా నీకు?’’ అని బ్రిటిష్ అధికారి అంటే.. ‘‘చచ్చి పుట్టినవాడిని.. చనిపోయిన తర్వాత కూడా బతికే వాడిని. చావంటే నాకెందుకురా భయం’’ అని చిరు డైలాగ్స్ ఏ రేంజ్ లో పేలుతాయో అర్థం అవుతుంది. అయితే ఈ చిన్న డైలాగ్‌ అభిమానుల కోసం లీక్‌ చేశానని.. ఇందుకు చిరంజీవిగారు కోప్పడతారేమో తెలియదని పరుచూరి చెప్పడం విశేషం.

ఈ సినిమా కోసం 12 ఏళ్లు ఆగామని.. సురేందర్‌రెడ్డిలాంటి అద్భుతమైన దర్శకుడు దొరకడం.. అమితాబ్‌ బచ్చన్‌, జగపతిబాబులాంటి మంచి నటులు సమకూరడంతో సినిమా గొప్పగా తయారవుతోందని ఆయన చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: