టాలీవుడ్, కోలీవుడ్ లో నెంబర్ వన్ రేస్ లో ఉన్న హీరోయిన్ త్రిష.  గత కొంత కాలంగా లేడీ ఒరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్న త్రిష ఆ మద్య మోహిని సినిమాతో జనాను భయపెట్టింది.  తాజాగా త్రిష, విజయ్ సేతుపతి నటిస్తున్న ‘96’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.  నందగోపాల్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 


 ఈ సినిమా ఎప్పుడో పట్టాలెక్కిన విడుదల విషయంలో కాస్త లేట్ అవుతుంది. సెప్టెంబర్ 13న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ అభిమానులని అలరిస్తుంది. విజయ్ సేతుపతి, త్రిషల చిన్నతనం సీన్స్ తో పాటు వారు ఎదిగిన తర్వాత ఇద్దరు ఒక్కటిగా ఎలా అయ్యారు అనేది ట్రైలర్ లో చూపించారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కొత్త లుక్ తో కనిపిస్తుంటే, త్రిష మరింత గ్లామర్ గా అనిపిస్తోంది.

Image result for trisha 96 movie

ఈ సినిమా తమ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందని నాయకా నాయికలు భావిస్తున్నారు. వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.  త్రిష నటిస్తున్న మరో చిత్రం గర్జానై . 2015లో ఎన్ హెచ్ 10 అనే హిందీ మూవీ రీమేక్ గా రూపొందుతుంది. సుందర్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష, వంశీ కృష్ణ, అమిత్ భార్గవ్, శ్రీ రంజని, వడివుక్కరసి, మధురై ముత్తు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: