సూపర్ రజినికాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ సినిమాకు సీక్వల్ గా 2.ఓ అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. దాదాపుగా 450 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాకు ఇన్నాళ్లుగా కష్టాలు ఎదురయ్యాయి. సినిమాకు పనిచేసే సిజి సంస్థ ఒకటి చేతులెత్తేయడంతో 2.ఓ మరింత కష్టాల్లో పడ్డది. 


ఇక ఎలాగోలా సినిమాను పూర్తి చేసిన టీం ఇప్పుడు సినిమాపై అంచనాలను పెంచాలని చూస్తుంది. 2.ఓ సినిమా ఎనౌన్స్ చేసిన నాటి నుండే భారీ అంచనాలు ఏర్పడగా వాటికి తగినట్టుగానే సినిమా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఇదిలాఉంటే కొన్నాళ్లుగా టీజర్ రిలీజ్ డేట్ కూడా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చిన చిత్రయూనిట్ ఫైనల్ గా టీజర్ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేసింది. సెప్టెంబర్ 13 వినాయక చవితి సందర్భంగా 2.ఓ టీజర్ రిలీజ్ చేస్తున్నారట. 


ఇలానే చాలాసార్లు టీజర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు కాని ఆ టైం కు వచ్చే సరికి సారీ అనేశారు. అయితే ఈసారి మాత్రం తప్పకుండా 2.ఓ టీజర్ వచ్చేస్తుందని అంటున్నారు. 2డి, 3డి రెండిటిలో ఈ టీజర్ వస్తుందని తెలుస్తుంది. హాలీవుడ్ సినిమాకు ఏమాత్ర తీసిపోని విధంగా శంకర్ ఈ సినిమా రూపొందిస్తున్నారట. 


సినిమాలో రజినికి ప్రతినాయకుడిగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు అక్షయ్ కూడా మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాడని అంటున్నారు. రిలీజ్ విషయంలో కూడా ఇప్పటికే చాలా వాయిదాలు పడగా ఫైనల్ గా ఈ సినిమా ఈ ఇయర్ దీవాళికి రిలీజ్ ఫిక్స్ చేశారట. టీజర్ తో సినిమా శాంపిల్ చూపించబోతున్న శంకర్ సినిమా మీద వస్తున్న రూమర్స్ అన్నిటికి చెక్ పెట్టేలా ఈ టీజర్ రిలీజ్ చేస్తున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: