సెల్ఫీలు దిగాలనే కోరిక చాలామందికే ఉంటుంది. సమయం సందర్భంగా కలిసి వస్తే సెల్ఫీలు దిగేవారికి లేక్కేలేదు. ఇక సినిమా సెలబ్రిటీలు దీనికి అతీతం కాదు. వారు కూడా సెల్ఫీల విషయంలో స్పీడ్ గానే ఉంటారు. ఏదైనా ఫంక్షన్ లోనో.. టూర్లు వెళ్ళినప్పుడో మంచి మంచి సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. అంతేనా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ కు కనువిందు చేస్తుంటారు.


ఓ రకంగా సెల్ఫీల పిచ్చి సామాన్య జనం కంటే సినిమా స్టార్లకే ఎక్కువని అనుకోవచ్చు. చిన్న చిన్న ఆర్టిస్టులు పెద్ద స్టార్స్ ను కలిసినప్పుడు వారితో సెల్ఫీలు దిగాలని ఉత్సాహపడతారు. ఇలాంటి ఛాన్సే హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ కి వచ్చింది. అదీ మెగాస్టార్ తో సెల్ఫీ దిగే ఛాన్స్ అన్నమాట. అంత పెద్ద స్టార్ తో సెల్ఫీ అంటే ఎవరైనా వదులుకుంటారా చెప్పండి. 


అనుపమ కూడా వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంది. తాను మెగాస్టార్ తో తీసుకున్న సెల్ఫీని మెగా బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసింది. ఇంకేముంది ఈ క్యూటీ పోస్ట్ చేసిన బ్యూటీ ఫొటో కాస్తా వైరల్ అయిపోయింది. వామ్మో అనుపమ పైకి సెలెంట్ గా కనిపించినా చిచ్చర పిడుగే అనుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. 


సార్ ఒక్క సెల్ఫీ ప్లీజ్ అని అనడంతో బాస్ కాస్తా కరిగిపోయి ఉంటారని సరదాగా ముచ్చటించుకుంటున్నారు. ఈ అమ్మడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించింది. ప్రెజెంట్ రామ్ సరసన హలో గురు ప్రేమ కోసమే మూవీలో ఆడిపాడుతోంది. మెగా కాంపౌండ్ మరిన్ని సినిమాలు చేజిక్కించుకుంటుందేమో చూడాలి.       



మరింత సమాచారం తెలుసుకోండి: