ఈవారం నాగ శౌర్య ‘@నర్తనశాల’ విడుదలకు సర్వం సిద్ధం అయింది. ఈసినిమాకు పోటీగా నాగచైతన్య ‘శైలజా రెడ్డి అల్లుడు’ విడుదల అవుతుంది అని అందరు భావించినా ఆమూవీ పోటీ నుండి తప్పుకోవడంతో నాగశౌర్యకు వన్ సైడ్ వార్ అని అనుకున్నారు అంతా.
Paperboy Movie Release On August 31
అయితే అనూహ్యంగా ఈమూవీకి పోటీగా అతిచిన్న సినిమాగా ప్రమోట్ చేయబడుతున్న ‘పేపర్ బాయ్’ విడుదల అవ్వడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. అంతేకాదు ఈసినిమాను ఈమధ్య అల్లుఅరవింద్ బన్నీ వాసులు చూసి ఈసినిమా చాలబాగుంది అని మెచ్చుకోవడమే కాకుండా ఈమూవీ టోటల్ రైట్స్ ను ఈమూవీ నిర్మాత దర్శకుడు సంపత్ నంది నుండి కొనడం టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. 

సాధారణంగా అరవింద్ ఒక సినిమాను చూసి మెచ్చుకున్నాడు అంటే అమూవీలో ఏదో ఒకవిషయం ఉంది అన్నప్రచారం జరుగుతుంది. ఇప్పుడు అరవింద్ ప్రశంసలు లభించడమే కాకుండా ఏకంగా ఈమూవీ విడుదల విషయంలో అల్లు కాంపౌండ్ సపోర్ట్ లభించడంతో ధియేటర్ల విషయంలోనూ పబ్లిసిటీ విషయంలోనూ మంచి పబ్లిసిటీ లభిస్తుంది. 
mahesh babu
ఒకనాటి ప్రముఖ దర్శకుడు శోభన్ కొడుకు సంతోష్ శోభన్ ఈమూవీలో హీరోగా నటిస్తూ ఉండటంతో పాటు దర్శకుడు శోభన్ తో మహేష్ కు ఉన్న గత అనుబంధంతో ఈమూవీని మహేష్ స్వయంగా ప్రమోట్ చేయడమే కాకుండా ఈమూవీని చూడమని చెపుతూ మహేష్ తన అభిమానులకు పిలుపు కూడ ఇచ్చాడు. ఇప్పటికే ఈమూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతోపాటు ఈమూవీలోని పాటలు క్యాచీ ట్యూన్స్ గా మారిన నేపధ్యంలో ఈచిన్న సినిమాలో ఏమైనా విషయం ఉందా అన్నసందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికితోడు ‘నర్తనశాల’ మూవీని ప్రమోట్ చేస్తూ ఈమూవీ యూనిట్ పదే పదే ‘ఛలో’ ని మించిన వినోదం ఉంటుందని చెపుతూ ఉండటంతో ఈమూవీ పై పెరిగిన భారీ అంచనాలలో తేడాలు వస్తే అది ‘పేపర్ బాయ్’ కి వరంగా మారే ఆస్కాం ఉంది అని టాక్..   



మరింత సమాచారం తెలుసుకోండి: