‘బిగ్ బాస్ 2’ షో విజేతగా కౌశల్ నిలవాలి అని అతడి అభిమానులు కౌశల్ ఆర్మీ పేరుతో చేస్తున్న ప్రయత్నాలు నిన్న ప్రసారం అయిన ‘బిగ్ బాస్ 2’ వీకెండ్ ప్రోగ్రాంలో అందరినీ ఆశ్చర్య పరిచే విధంగా ప్రసారం కాబడ్డాయి. నిన్నటి షోను హోస్ట్ చేస్తున్న నాని శేఖర్ అనే పేరుతో ‘బిగ్ బాస్ హోస్ ‘ కు వచ్చిన కాల్ ను కౌశల్ కు కనెక్ట్ చేసాడు.
Bigg Boss 2 shocking episode Bhanu slams Kaushal for inappropriately touching her
ఆకాల్ లో ఆ వీరాభిమాని ‘కౌశల్ అన్నా’ అంటూ మాట్లాడిన తీరుకు కౌశల్ కరిగిపోయి తన కంటి వెంట కన్నీరు పెట్టుకోవడం నిన్నటి షోకు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు కౌశల్ ఆర్మీ పేరుతో కౌశల్ అభిమానులు అతడి కోసం సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచార వివరాలను తెలుసుకుని కౌశల్ తన కృతజ్ఞతలు తెలియచేస్తూ మరింత కన్నీరు పెట్టుకున్నాడు.
Bigg Boss Contestants Who Target Kaushal Evicted?
దీనితో కౌశల్ ఈ షో విజేత కౌశల్ కాబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరేడట్లుగా చేసింది. దీనికితోడు కౌశల్ ను కార్నర్ చేయాలి అని ప్రయత్నించిన తేజస్వీ కీర్తి భాను బాబు గోగినేనిలు ఈషో నుండి ఎలిమినేట కావడంతో కౌశల్ కు ఇక ఎదురు లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
Image may contain: 1 person
అయితే చిట్టచివరకు కౌశల్ కు పోటీగా గీత మాధురి నిలిచే ఆస్కారం ఉన్నా సోషల్ మీడియాలో ఈమె కోసం అభిమానులు చేస్తున్న హంగామా చాల తక్కువగా కనిపిస్తున్న నేపధ్యంలో ఇలా ఎలా చూసుకున్నా ప్రస్తుతానికి కౌశల్ హవా కనిపిస్తోంది. అయితే ‘బిగ్ బాస్’ షోలో ఏదైనా జరగవచ్చు కాబట్టి ఎవరూ ఊహించని వ్యక్తి ఈ షోకు ఆఖరి నిముషంలో  విజేతగా ప్రకటించే ఆస్కారం ఉంది అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: