ఆమె నిజంగా అందాల రాక్షసి. తన సొగసుతో కట్టిపడేస్తుంది. ఎక్కడో ఉత్తరాదిలో పుట్టినా అచ్చ తెలుగింటి ఆడ పిల్లలా కనిపిస్తుంది. మురిపిస్తుంది. తొలి చిత్రం అందాల రాక్షసితోనే టాలివుడ్  గుండె తలుపు తట్టేసిన ఈ భామ హాట్ పోజులతో పాటు నీట్ వేషాలూ వేయగలదు. రెండు వైపులా పదునైన కత్తి లాంటి ఈ చిన్నది ఓ లేటేస్ట్ గ్లామర్. అయితే అంతటి అందం  ఆమెకు అసలు వర్కవుట్ అవుతోందా అంటే దౌటే...



హిట్లను మాత్రమే కొలమానంగా  చూసే టాలీవుడ్లో లావణ్యకు సరైన సక్సెస్ రావడం లేదు. అపుడెపుడో రెండేళ్ళ క్రితం అనుకుంట సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో పెద్ద హిట్ కొట్టేసింది. దాంతో ఆమె ఓ రేంజిలో టాప్ హీరోయిన్ ఐపోతుందేమోన్ని అంతా  అనుకున్నారు. అప్పటి  అగ్ర నాయికలూ బెదిరారు కూడా. ఏం జరిగిందో కానీ ఆమెకు ఆ తరువాత ఒక్కటంటే ఒక్క హిట్ మూవీ పడలేదు. శర్వానంద్ తో చేసిన  రాధ మూవీ  బోల్తా కొట్టింది.ఆ తరువాత కుర్ర హీరోలతో చేసిన సినిమాలు వరసగా దెబ్బ కొట్టేసాయి.



సరిగ్గా ఈ టైంలో గీతా గోవిదం టీం ఆమెను అప్రోచ్ అయిందట. దేవరకొండ విజయ్ సరసన హీరోయిన్ కోసం. అయితే లావణ్య మాత్రం డేట్స్ ఖాళీలేక అడ్జస్ట్ చేయలేకపఒయింది. ఇపుడు ఆ డేటే ఆమె ఫేట్ ని మార్చేసింది. వంద కోట్ల క్లబ్ లో  గీతా గోవిదం చేరి సూపర్ సక్సెస్ కొట్టింది. దాంతో లావణ్య బాధ వర్ణనాతీతం. అయ్యో టాప్ హిట్ మూవీలో చాన్స్ మిస్ అయిందేనని ఈ ముద్దు గుమ్మ ఇపుడు వగచి వాపోతోందిట. కానీ ఏం లాభం. లావణ్యా ...ఎంత అందమున్నా  కాసింత లక్కు కూడా ఉండాలమ్మా అంటున్నారుట అమెను చూసి ఇపుడు టాలీవుడ్ జనమంతా.







మరింత సమాచారం తెలుసుకోండి: