మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ మెగా కాంపౌండ్ పై అలిగాడా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడంతో ఇతడి పై కూడ మెగా అభిమానులలో క్రేజ్ పెరిగింది. 
Chiru Son in-law Kalyan Dev movie details
వాస్తవానికి చిరంజీవి వ్యూహాత్మకంగా ‘విజేత’ సినిమాను తక్కువగా ప్రమోట్ చేయాలని భావించినా ఆ తరువాత వచ్చిన ఆలోచనలోని మార్పులతో స్వయంగా చిరంజీవి రంగంలోకి దిగి కళ్యాణ్ దేవ్ ను ప్రమోట్ చేసాడు. అయితే ఈసినిమాకు కనీసపు ఓపెనింగ్స్ కూడ రాకుండా మెగా అభిమానుల సైతం ‘విజేత’ ధియేటర్ల వైపు రాకపోవడం చాలామందిని ఆశ్చర్య పరిచింది. 
kalyan dev started dubbing works for his first film!
మెగా హీరోల క్రికెట్ టీమ్ లో స్థానం సంపాదించాలని కళ్యాణ్ దేవ్ చేసిన ప్రయత్నాలకు కనీసం విమర్శకుల దగ్గర నుండి కూడ సరైన ప్రోత్సాహం లభించక పోవడం మెగా కాంపౌండ్ ను కూడ ఆశ్చర్య పరిచింది అని టాక్. ఈపరిస్తుతుల నేపధ్యంలో ఈమధ్య జరిగిన చిరంజీవి ‘సైరా’ రిలీజ్ ఫంక్షన్ లో కానీ అదేవిధంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలలో కానీ కళ్యాణ్ దేవ్ ఎక్కడా కనిపించక పోవడంతో కళ్యాణ్ దేవ్ అలిగాడా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. 
kalyan dev speech at vijetha audio launch event
ఇది ఇలా ఉండగా కళ్యాణ్ దేవ్ రెండవ సినిమా విషయంలో ఎటువంటి ఖంగారు నిర్ణయాలు వద్దనీ నటన పరంగా అదేవిధంగా డాన్స్ పరంగా ఇంకా మార్పులు చేర్పులు చేసుకుని నేటితరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా కళ్యాణ్ దేవ్ ను తన కెరియర్ పై దృష్టి పెట్టమని ఇప్పటికే చిరంజీవి తన మెగా అల్లుడుకి సూచనలు ఇచ్చినట్లు టాక్. ఒక ప్రముఖ దర్శకుడు డేట్స్ కోసం చిరంజీవి ప్రయత్నిస్తున్నాడని అన్నీ కుదిరితే వచ్చే సంవత్సరం కళ్యాణ్ దేవ్ సినిమా ఉండవచ్చని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: