విజయ్ దేవరకొండ.. ఈ యంగ్ హీరో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. అతని స్టైల్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. వారే కాదు సినీ పెద్దలు కూడా ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఆ రేంజ్ లో విజయ్ క్రేజ్ పెరిగిపోయింది.


ఈ మాదిరి క్రేజ్ రావడంలో కీలక భూమిక అర్జున్ రెడ్డి మూవీదే అని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఈ సినిమా బంపర్ హిట్ అయింది. అప్పట్లో ఈ మూవీ చేసిన హంగామాని రాతల్లో చెప్పడం కష్టం. ఓ మామూలు సినిమాగా వచ్చి వెండితెరను షేక్ చేసేసింది.


కలెక్షన్ల పరంగా నిర్మాతలకు బంగారు బాతులా మారింది. ఓ చిన్న సినిమా ఈ రేంజ్ లో హిట్ అవుతుందని ఇండస్ట్రీలో దిగ్గజాలు కూడా ఊహించలేకపోయారు.  ఈ మూవీ రిలీజ్ అయిపోయి ఏడాది అయింది. ఈ సందర్భంగా విజయ్ ఈ  సినిమా తాలూకు తన స్టిల్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.


అర్జున్ రెడ్డికి వచ్చిన రెస్పాన్స్ దీనికి కూడా వస్తోంది. జనం విరగబడి లైక్స్, షేర్లు చేసేసుకుంటున్నారు. ఇది చూసి ఇండస్ట్రీ వ్యక్తులు విజయ్ కి ఏం క్రేజ్ వచ్చిందిరా బాబు.. అనుకుంటున్నారు. ఇదిలాఉంటే విజయ్ తాజా చిత్రం గీతా గోవిందం కూడా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తోంది అందరికి తెలిసిందే కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: