బాహుబలి మూవీతో నేషనల్ లెవెల్ లో స్టార్ హీరోగా మారిపోయాడు ప్రభాస్. ఇక డార్లింగ్ తో సినిమాలు తీసేందుకు బాలీవుడ్ సహా అన్ని ఇండస్ట్రీల దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. కాని ఈ హీరో మాత్రం ఎవ్వరికి ఒకే చెప్పలేదు. ఫుల్ టైమ్ మొత్తం సాహో మూవీపైనే పెట్టేశాడు.


ఈ సినిమా కోసం భారీ రిస్క్ కూడా చేస్తున్నాడట. రియల్ స్టంట్స్ చేస్తూ పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఇలా చేయడం వల్ల ఫ్యూచర్ లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందనే ఆలోచనే ప్రభాస్ లో కనిపించడం లేదని ఆయన్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ మూవీలో స్టంట్స్ కి హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు.


ప్రభాస్ వారు చెప్పింది చెప్పినట్లు చేయడానికి అస్సలు వెనుకాడటం లేదు. రిస్కీ షాట్స్ ని కూడా డూప్ లేకుండానే చేస్తున్నాడు.  ఫైట్ సీన్లు బాగా రావడం కోసం హాలీవుడ్ టెక్నీషియన్లతో సమానంగా పరిగెడుతున్నాడన్నమాట. డార్లింగ్ లో ఈ పట్టుదల ఉంది కాబట్టే నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ కు వెనుకాడటం లేదు.


బాహుబలి తర్వాత నటిస్తోన్న ఈ మూవీతో అన్ని వర్గాల ప్రేక్షకులని థ్రిల్ చెయ్యాలని ప్రభాస్ ప్లాన్ గా తెలుస్తోంది. దీనికోసం భారీ ఫైటింగులు కూడా చేసేస్తున్నాడు. రీసెంట్ గా దుబాయ్ బుర్జ్ ఖలీఫా దగ్గర నీల్ నితిన్ ముకేశ్‌తో ఫైటింగులు చేసిన రెబెల్ స్టా్ర్ ప్రెజెంట్ హైదరాబాద్‌ లోనూ సేమ్ మూడ్‌ ని కంటిన్యూ చేస్తున్నాడు. ఎక్కడా డూప్స్‌ని వాడకుండా 90 పర్సంట్ కి పైగా రియల్ స్టంట్స్ చేస్తున్నాడట.ఇక నిర్మాతలు కూడా ఈ యాక్షన్ సీక్వెన్సెస్‌కు 90 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. మరి ప్రభాస్ పడే కష్టానికి ఫలితం దక్కుతుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: