Image result for raj kapoor family

"ఆ తలంపే మా గుండెలపై రాయి పడేసినా - ఆర్కె స్టూడియోస్ అమ్మేయాలి అనుకోకుండా ఉండలేక పోతున్నాం. ఆర్ధిక ఇబ్బందులు మమ్మల్ని తెములు కోనివ్వట్లేదు. ఆర్కె స్టుడియోస్ నిర్వహణ భారం తడిసి మోపెడు అవుతుంది"  కుటుంబానికి ఆర్కే స్టూడియోస్ తొ పెనవేసుకున్న అద్భుత ఙ్జాపకాలు ఉన్నా ఏమీ చేయలేని ఆర్ధిక పరిస్థితులు తమని తరిమేస్తున్నాయన్నారు ప్రఖ్యాత నటుడు రాజ్ కుమార్ తనయుడు రిషి కపూర్ ఆవేదన వెలిబుచ్చారు.  

Image result for rk studios mumbai

రాజ్ కపూర్ భారతీయ చిత్రరంగానికి ముఖ్యంగా బాలీవుడ్ లో ఒక శకాన్ని యుగాన్ని శాసించిన యుగకర్త. ఈ యుగపురుషుడు తన నటన దర్శకత్వం నిర్మాణత తదితర రంగాల్లో తనదైన ముద్రవేశారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చాక ఒక సంవత్సరానికి ఆర్కే స్టూడియోస్ నిర్మించి చిత్రరంగానికి అజేయమైన సేవలందించారు రాజ్ కపూర్.  

Image result for raj kapoor family

బాలీవుడ్ కు చెందిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మాణం జరిగిన ఆర్కే స్టూడియోస్ ను అమ్మేయాలని యాజమాన్యం నిర్ణయించుకుంది. బాలీవుడ్ స్టార్ – సినీ లెజెండ్  రాజ్ కుమార్ నిర్మించిన ఆర్కే స్టూడియోలో గత సంవత్సరం అగ్ని ప్రమాదం జరిగి ఆ ప్రమాదంలో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది.

Image result for raj kapoor family

అప్పటి నుండి ఆర్కే స్టూడియోస్  లో నిర్మాణం చాలా వరకు తగ్గు ముఖం పట్టింది. స్టూడియోస్ ను పునర్నిర్మించేందుకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్న కారణంగా రాజ్ కుమార్ వారసులు స్టూడియోస్ ను అమ్మేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

Image result for raj kapoor family

తాజాగా రాజ్ కుమార్ తనయుడు రిషి కపూర్ ఈ విషయమై మాట్లాడుతూ తమకు ఎంతో సెంటిమెంట్ – భావోద్వేగం కలగాపులగమై మా గుండెల్లో రాయి పడ్డప్పటికీ, భరించలేని ఆర్థిక భారం తదితర కారణాల వల్ల స్టూడియోస్ ను అమ్మేయాలని కుటుంబ సభ్యులందరం కలసి నిర్ణయించుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

Image result for raj kapoor family

ఆర్కె స్టూడియోస్  లో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత, దానిని  పునర్నిర్మించేందుకు ప్రయత్నాలు చేశాం.  కాని అందుకు ఆర్థికంగా భారీ ఎత్తున ఖర్చు అవ్వడంతో పాటు ఆ తర్వాత లాభాలు వస్తాయన్న నమ్మకం కలగటం లేదు. అందుకే స్టూడియో పునరుద్దరణ నిర్ణయంను ఉపసంహరించుకుని, దానిని అమ్మేయాలనే ఆలోచనకు వచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చాడు. ఆర్కె స్టూడియోస్  లో అగ్నిప్రమాదం జరగక ముందు నుండే ఆర్థిక ఇబ్బందుల్లో నడుస్తూ వస్తుంది.

Image result for raj kapoor and his wife krishna

ప్రస్తుతం ఆర్కె స్టూడియోస్ లో టెలివిజన్ సీరియల్స్ - చిన్న చిన చిత్రాల నిర్మాణం జరుగు తున్నా కూడా  లాభాలు రావడం లేదు. అప్పట్లో అధునాతన టెక్నాలజీతో ఆర్కె స్టూడియోస్ ను అప్ గ్రేడ్ చేయాలని భావించాం.  కాని దానికి తగిన సరైన ఆర్థిక వనరులు తమవద్ద లేకపోవడంతో ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కు తీసుకున్నట్లుగా పేర్కొన్నాడు. తన తండ్రి రాజ్ కుమార్  స్వాతంత్య్రం వచ్చిన ఏడాదికి ఈ స్టూడియోను ఎన్నీ కలలతో ఎంతో శ్రమకోర్చి నిర్మించడం జరిగిందని అన్నారు.అనేక అద్భుత కళాఖండాలు ఆవారా, శ్రీ 420, మెరా నాం జోకర్, జిస్ దేశ్ మె గంగా బెహ్తి హై, బాబీ, రాం తెరా మైలీ, కల్ ఆజ్ ఔర్ కల్, సత్యం శివం సుందరం, ప్రేం గ్రంద్ లాంటి అత్యుత్తమ సినిమాలు ఈ స్టూడియోస్ లో నిర్మించారు. 

Image result for raj kapoor family

విఖ్యాత సినీ ప్రముఖుడు రాజ్ కుమార్ జ్ఞాపకార్థం ఆర్కె స్టూడియోస్  ను కనీసం ప్రభుత్వం  స్వాదీనం చేసుకుని దానిని అలాగే నడిపించితే బాగుంటుందని రాజ్ కుమార్  అభిమానులు కోరుతున్నారు. బయట వ్యక్తులు ఈ స్టూడియోను కొనుగోలు చేస్తే అది ప్రస్తుత పరిస్థితుల్లో కమర్షియల్ అవసరాలకు ఆ స్థలంను వాడేసే అవకాశం ఉందని, అదే జరిగితే రాజ్ కుమార్ జ్ఞాపకాలు అన్ని కనుమరుగౌతాయని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో కుటుంబ సభ్యులు మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. అమ్మేసి చేతులు దులిపేసుకోవాలని వారు భావిస్తున్నారు.

Image result for raj kapoor family

ది గ్రేట్ గ్రాండ్ షో మాన్ రాజ్ కపూర్ శ్రీమతి కృష్ణ రాజ్ కపూర్, వారి తనయులు రణధీర్ కపూర్, రిషి కపూర్ మరియు రాజీవ్ కపూర్ తనయలు రీతు నంద  రీమ జైన్ అందరూ కలసి స్టూడియోస్ ను అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నట్లు - రెండు ఎకరాల విస్థీర్ణంలో వ్యాపించి ఉన్న దాని నిర్వహణ తమకు సాధ్యం కావటం లేదన్నారు. ఎక్కువ భాగం గత సంవత్సరం సెప్టెంబర్ 16న జరిగిన అగ్ని ప్రమాదానికి దహించుకుపోయింది.

Image result for raj kapoor

ఈ నేపథ్యంలో దీని ధర గురించి ఆసక్తిదాయకమైన సమాచారం వెల్లడౌతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, ముంబై లోని ఈ స్టూడియో ధర ఐదు వందల కోట్ల రూపాయల వరకూ ఉండవచ్చు. రెండు ఎకరాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ స్టూడియో ఈ భారీ ధర పలకటంలో ఆశ్చర్యం లేదు అని ఆ కథనం పేర్కొంది.

Image result for RK studios beautiful photo

ఈ  స్టూడియో కు ఎంతో చారిత్రాత్మక నేపధ్యం ఉంది. ఇక్కడ అనేక సినిమాలు రూపకల్పన అయ్యాయి. ఈ స్టూడియో లోనే రాజ్ కపూర్ ఎన్నో క్లాసిక్స్‌కు ప్రాణం పోశారు. ముంబై మహానగరంలో ప్రస్తుతం ఉన్న భూముల ధరలను పరిగణనలోకి తీసుకున్నా, ఇది ఐదొందల కోట్లరూపాయల ధర పలకడం ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. "మూవీ మేకింగ్‌" లోకి  ఇప్పుడిప్పుడే  రిలయన్స్ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు,  ప్రవేశిస్తున్న నేపథ్యంలో వాళ్లలో ఎవరైనా ఈ స్టూడియో కొనుగోలు  చేయటానికి ముందుకు రావొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: