గత కొంత కాలంగా మహేష్ టాప్ హీరోలు అందరితోను తన సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ తాను అందరి వాడిని అన్న సంకేతాలు ఇస్తున్నాడు. ముఖ్యంగా మహేష్ జూనియర్ తో అదేవిధంగా రామ్ చరణ్ తో తన వ్యక్తిగత స్నేహాన్ని పెంచుకుంటూ జూనియర్ మెగా అభిమానులను తన అభిమానులుగా మార్చుకుంటున్నాడు.
Mahesh Babu in Bharat Ane Neenu. Image via Twitter
సమ్మర్ రేసు కు విడుదలైన ‘భరత్ అనే నేను’ మూవీ ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు మహేష్ జూనియర్ తో తనకు గల సాన్నిహిత్యాన్ని వివరిస్తూ అనేక ప్రసంసలు కురిపించాడు. అంతేకాదు టాప్ హీరోలు అయిన తామంతా ఒకటే అనీ అనవసరంగా తమ గురించి గొడవలు పడవద్దు అంటూ తన అభిమానులతో పాటు జూనియర్ అభిమానులకు కూడ సందేశం ఇచ్చాడు. 
Mahesh Babu and Jr NTR at the pre-release event of Bharat Ane Nenu.
అయితే ఈ సంఘటన జరిగి కొన్ని నెలలు గడవకుండానే జూనియర్ మహేష్ అభిమానుల మధ్య చిచ్చు రేగింది. దీనికి కారణం విజయ్ దేవరకొండ. ఈమధ్య విజయ్ మహేష్ లేటెస్ట్ మూవీ ‘మహర్షి’ షూటింగ్ స్పాట్ కు వెళ్లి మహేష్ ను కలవడమే కాకుండా అతడి పై తనకున్న అభిమానాన్ని వివరిస్తూ తన ట్విటర్ లో కామెంట్స్ పెట్టడమే కాకుండా మహేష్ తో తాను తీయించుకున్న ఫోటోను కూడ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఈవిషయానికి స్పందిస్తూ మహేష్ తన ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు తెలియచేసాడు. 

ఇప్పుడు ఈవిషయమే జూనియర్ అభిమానులకు తీవ్రమైన కోపాన్ని తెప్పించింది. కొద్దిరోజుల క్రితం జరిగిన మహేష్ పుట్టినరోజునాడు జూనియర్ తన ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పినా కనీసం కృతజ్ఞతలు కూడ తెలియచేయని మహేష్ ఇలా విజయ్ కు వెంటనే కృతజ్ఞతలు తెలియచేయడం జూనియర్ అభిమానులను బాధిస్తోంది అంటూ వారు కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు ‘భరత్ అనే నేను’ విజయానికి ఎంతగానో సహకరించిన జూనియర్ ను మర్చిపోయాడా అంటూ మహేష్ పై జూనియర్ అభిమానులు మాటల దాడి కూడ చేస్తున్నారు. ఒక సిల్లీ విషయం కోసం జూనియర్ అభిమానులు మహేష్ పై స్పందిస్తున్న తీరు చూసి టాప్ హీరోలు ఎంత చెప్పినా వారి అభిమానులు మారరు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..
 


మరింత సమాచారం తెలుసుకోండి: