తెల్లని జుత్తు నెరిసిన గెడ్డంతో ఎప్పుడూ కనిపించే ఒకస్టార్ కు లేడీస్ ఫాలోయింగ్ కూడ పెరిగింది అంటే అది నమ్మలేని నిజం. అయితే ఫ్యామిలీ హీరోగా ఒకప్పుడు మహిళల అభిమానాన్ని పొందిన జగపతిబాబు విలన్ లుక్ ను ప్రస్తుత తరం అమ్మాయిలు కూడ లైక్ చేస్తున్న విషయాన్ని జగపతిబాబు బయటపెట్టాడు. తాను ఫిలింఇండస్ట్రీకి వచ్చి 30సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా నిన్నరాత్రి ఒకప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగపతిబాబు కొన్ని ఆసక్తికర విషయాలు వివరించాడు. 

తన విలన్ కెరియర్ 2013 లో మొదలైనా తన సెకండ్ ఇన్నింగ్స్ పీక్ స్టేజ్ 2018 నుంచి ఉంటుందని తమిళనాడులోని తాళపత్ర గ్రంధాలు చూసి తనకు జోశ్యం చెప్పిన జ్యోతిష్కుడు మాటలు బయటపెడుతూ తన టాప్ కెరియర్ మరికొన్ని సంవత్సరాలు కొనసాగుతుంది అన్న సంకేతాలు ఇచ్చాడు ఈవిలక్షణ విలన్. సొంత ఇల్లు అమ్ముకుని కూతురు పెళ్లి చేయడానికి డబ్బులు కూడ లేని పరిస్థుతుల నుండి ఇప్పుడు తిరిగి కోట్ల రూపాలలో పారితోషికం తీసుకుంటున్న తన కెరియర్ గురించి మాట్లాడుతూ ఈపరిస్థితి అంతా కేవలం తన అదృష్టం వల్లే వచ్చింది అని అంటున్నాడు. 
Jagapathi to play a neurotic RAW agent
సినిమాఇండస్ట్రీ అంటేనే బిజినెస్ అనీ తనను ఫెయిల్యూర్ వెంటాడుతున్న రోజులలో సినిమాలలో నటిస్తున్నప్పుడు తనను భోజనం చేసారా అని అడగని నిర్మాతలు కూడ ఉన్నారని పరాజయాలతో సతమతయ్యే ఏవ్యక్తికైనా ఇలాంటి అనుభవాలు సర్వసాధారణం అంటూ గ్లామర్ ప్రపంచం అసలు రంగును బయటపెట్టాడు జగపతిబాబు. ఒకానొక సందర్భంలో తాను ఆర్ధికంగా సర్వం కోల్పోయినప్పుడు తనతండ్రి రాజేంద్రప్రసాద్ తనను చూసి ‘నాలా తయారయ్యావు ఇల్లు కూడ అమ్మేసావు’ అంటూ బాధపడిన సందర్భాలను గుర్తుకు చేసుకున్నాడు.
Jagapathi Babu
తాను ఆర్ధికంగా ఇబ్బందులలో ఉన్నప్పుడు తనకు కుటుంబ సభ్యులు తప్ప మరెవ్వరు సహాయం చేయని విషయాలు వివరిస్తూ అసలు ఒకరి దగ్గర నుంచి సహాయం పొందుదాము అన్నఆలోచన రావడమే చాలభయంకరం అంటూ జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇదేసందర్భంలో మారిపోయిన అభిరుచులు గురించి మాట్లాడుతూ ఈతరం యూత్ ‘బ్యాడ్ ఈజ్ గుడ్’ అన్న ఫీలింగ్ తో పెరుగుతున్నారని దీనివల్ల స్టైలిష్ లుక్ తో కనిపించే విలన్స్ కు హీరోలకన్నా క్రేజ్ పెరగడమే కాకుండా టాప్ హీరోలతో సమానంగా పారితోషికం వస్తోంది అంటూ తన పై తానే జోక్ చేసుకున్నాడు జగపతిబాబు. తన మొఖం సినిమాలకు పనికిరాదు అని తన కెరియర్ ప్రారంభంలో ఎందరో చేసిన కామెంట్స్ ను గుర్తుకు చేసుకుంటూ అదే మొఖాన్ని హీరోగా విలన్ గా ఇష్టపడిన ప్రేక్షకుల తీర్పు తనకు ఇప్పటికీ ఒక పజిల్ అని అంటున్నాడు ఈవిలక్షణ విలన్ జగపతిబాబు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: