రామ్ చరణ్ టాప్ హీరోల రేస్ లో తనస్థానాన్ని మరింత మెరుగు పరుచుకోవడానికి తనప్రయత్నాలు కొనసాగిస్తూనే భారీసినిమాలకు నిర్మాతగా ప్రముఖ వ్యాపార సంస్థలకు అధిపతిగా బహుముఖ పాత్రలు పోషిస్తూ తనకెరియర్ ను చాల ప్లాన్డ్ గా కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే తన ఇంటిపేరుతో కొణిదల ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించిన రామ్ చరణ్ చిరంజీవితో ‘ఖైదీ నెంబర్ 150’ తీసి ఇప్పుడు మళ్ళీ చిరంజీవితోనే ‘సైరా’ అత్యంత భారీస్థాయిలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 
Ram Charan
ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో భారీ నిర్మాణ సంస్థగా కొణిదల ప్రొడక్షన్స్ ను మార్చాలని ప్రయత్నాలు చేస్తున్న రామ్ చరణ్ ఈసంస్థను ఒక కార్పరేట్ సంస్థగా మార్చి కేవలం చిరంజీవితో మాత్రమే సినిమాలు తీయకుండా ఇతర హీరోలతో భారీ ప్రాజెక్టులు కూడా చేసే ఆలోచన వుందని తెలుస్తోంది. రామ్ చరణ్ ఇతర యంగ్ హీరోలతో మంచి సాన్నిహిత్యంతో పాటు అనేకమంది ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంచిసంబంధాలు ఉన్ననేపధ్యంలో రాబోయే సంవత్సరాలలో దక్షిణ భారతదేశ ఫిలిం ఇండస్ట్రీలో తన కొణిదల ప్రొడక్షన్ హౌస్ ను టాప్ గా మార్చాలని చరణ్ రచిస్తున్న వ్యూహాలు హాట్ టాపిక్ గా మారాయి.
Ram Charan To Keep A Special Screening Of Dhruva For Police Officers
ఈమధ్య చరణ్ తన పర్సనల్ స్టాఫ్ విషయంలో కొన్నిమార్పులు చేసాడు అన్నవార్తలు వస్తున్నాయి. తన వ్యవహారాలు అన్నీ చూసే ప్రవీణ్ ను ప్రొడక్షన్ సైడ్ కు మార్చి ఇటు ‘సైరా’ సినిమా మాత్రమే కాకుండా బోయపాటి డైరక్షన్లో దానయ్య నిర్మించే సినిమాకు కూడా ప్రవీణ్ ను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా నియమించినట్లు టాక్. ఇక తన రెగ్యులర్ విషయాలు అన్నీ చూసుకునే మరో ప్రత్యేక వ్యక్తిని నియమించే నేపధ్యంలో చరణ్ తనకు సంబంధించిన తన చిన్ననాటి స్నేహితుడిని రంగంలోకి దింపుతున్నట్లు టాక్. 
Ram Charan Is The Best - Here's The Reason Why
ప్రస్తుతం ఆవ్యక్తి మన తెలుగు రాష్ట్రాలలోని ఒక రాష్ట్రంలో ఒకమంచి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడని తెలుస్తోంది. ఇప్పుడు ఆవ్యక్తి చేత అతడి ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవు పెట్టించి అతడికి తన వ్యక్తిగత విషయాలు అప్పచేపుతున్నట్లు సమాచారం. ‘సైరా’ తరువాత చిరంజీవి కొరటాలల కాంబినేషన్ లో సినిమాను తీస్తూ మరికొన్ని సినిమాలు తీసే ఆలోచనలు చరణ్ కు ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే చిరంజీవికి 65 సంవత్సరాలు దాటిన తరువాత ఒక లీజర్ యాక్టివిటిగా కొణిదల ప్రొడక్షన్స్ ను మార్చాలని రామ్ చరణ్ మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: