రాబోయే 2019 టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో బయోపిక్ ల సంవత్సరంగా మారబోతోంది. రాబోతున్న సంక్రాంతికి విడుదల కాబోతున్న ఎన్టీఆర్ వైఎస్ఆర్ బయోపిక్ లతో మొదలై పుల్లెల గోపీ చంద్ కాంతారావు జయలలితల బయోపిక్ లతో టాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ కాబోతోంది. ఇప్పుడు ఈ లిస్టులోకి సూపర్ స్టార్ కృష్ణ కూడ చేరబోతున్నాడు. తన మామయ్య కృష్ణ పై తాను స్వయంగా బయోపిక్ ను నిర్మిస్తున్నట్లు స్వయంగా సుధీర్ బాబు ప్రకటించడం సంచలనంగా మారింది. 
Sudheer Babu
నిన్న విశాఖపట్నంలో తన లేటెస్ట్ మూవీ ‘నన్ను దోచుకుందువటే’ మూవీని ప్రమోట్ చేస్తూ మీడియాతో మాట్లాడిన సుధీర్ బాబు ఈకామెంట్స్ చేసాడు. ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ జీవితం బయోపిక్ కు పెద్దగా సరిపోదు అన్న అభిప్రాయాన్ని కృష్ణ భార్య విజయనిర్మల వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. 
Sudheer Babu FC
అయితే ఇప్పుడు హఠాత్తుగా ఈ బయోపిక్ ఆలోచనలు సుధీర్ బాబు నోటివెంట రావడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఒకనాటి టాప్ హీరోలు అక్కినేని ఎన్టీఆర్ లకు సవాల్ విసురుతూ అనేక సినిమాలలో నటించిన సూపర్ స్టార్ కృష్ణ జీవితంలో చెప్పుకోతగ్గ చీకటి కోణాలు లేవు. కృష్ణ తనకు భార్య పిల్లలు ఉండగానే విజయనిర్మలను పెళ్లి చేసుకోవడం ఆతరువాత సూపర్ స్టార్ ఇమేజ్ కి ఎదగడం రాజకీయాలలోకి ప్రవేసించి అక్కడ తన ప్రాభవం చూపించాలి అని చేసిన ప్రయత్నాలు తప్ప కృష్ణ జీవితంలో చెప్పుకోతగ్గ సంచలనాలు లేవు.
Superstar Krishna in Janatha Garage?
అయితే సుధీర్ బాబు సూపర్ స్టార్ కృష్ణ జీవితంలో ఇంకా అందరికీ తెలియని వేరే విషయాలు ఏమైనా చూపెడతాడా లేదంటే ఇది ఒక రొటీన్ డాక్యుమెంటరీలా మారుస్తాడా అన్న సందేహాలతో పాటు కృష్ణ పాత్రలో సుధీర్ బాబు నటిస్తాడా లేక మరెవరైనా నటిస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్..  


మరింత సమాచారం తెలుసుకోండి: