ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సినీ - రాజకీయ - క్రీడా ప్రముఖుల జీవితాల్ని తెరకెక్కించేందుకు ఫిలింమేకర్స్ ప్రిపేరవుతున్నారు.  జగపతి ఆర్ట్స్ అధినేత - దసరా బుల్లోడు నిర్మాత అయిన ది గ్రేట్ వి.బి.రాజేంద్ర ప్రసాద్ వారసుడిగా హీరో అయినా జగపతిబాబు తన కెరీర్ కొనసాగించడానికి చాలా కష్టపడ్డాడు.  ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు కి భారీ స్థాయిలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఏవీ లేవు.   ఫ్యామిలీ హీరోగా మెప్పించిన ఆయన.. ఆ తర్వాత పరాజయాలను ఎదుర్కొన్నారు. 

ఇక జగపతి బాబు కెరీర్ పూర్తయ్యిందనుకుంటున్న సమయంలో బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ‘లెజెండ్’ సినిమాలో విలన్ అవతారం ఎత్తారు.  సెకండ్ ఇన్నింగ్స్ విలన్ అయినా..దానితో ఆయన అదృష్టం బాగా కలిసి వచ్చింది.  ప్రస్తుతం పలు భాషా సినిమాల్లో జగపతి బాబు బిజీ షెడ్యూల్స్ తో హ్యాపీగా కెరీర్ కొనసాగిస్తున్నారు.   ఈ ఏడాదిలో రంగస్థలం, గూఢచారి వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో జగపతిబాబు దూసుకుపోతున్నారు. 

తాజాగా జగపతి బాబు జీవితంలో ఎదుర్కొన్న ఎత్తుపల్లాలను బయోపిక్ గా తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ బయోపిక్ ను సినిమాగా కాకుండా సీరియల్ రూపంలో షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  జగపతి లైఫ్ లో ఎవరున్నారు? అంటే.. కొందరి పేర్లు పరిగణలోకి  వస్తున్నాయి.

జగపతిబాబుకు స్టార్ హీరోయిన్ ప్రియమణితో ఎఫైర్ ఉందన్న ప్రచారాన్ని వేరొక సీనియర్ యాంకర్ తో ఎఫైర్ అన్న మాటను.. అంత తేలిగ్గా మర్చిపోలేదు తెలుగు ప్రేక్షకులు. ఈ బయోపిక్ ను  20 ఎపిసోడ్లలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు.. దీని షూటింగ్ ఇప్పటికే ప్రారంభమయిందనీ, దీనికి ‘సముద్రం’ అనే టైటిల్ ను ఖరారు చేశారని వార్తలు వస్తున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: