ఇండస్ట్రీలో బాలనటిగా ప్రవేశించిన నటి మీనా..‘సీతారామయ్యగారి మనవరాలు’హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. ఈ సినిమాలో  సీతారామయ్యగారు (నాగేశ్వరరావు) భార్యకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకునే పాత్రలో అద్భుతంగా నటించారు.  ఇక తాతయ్యకు బాధ కలగకుండా ఉండటానికి మనసులో బాధను దిగమింగుకునే మనవరాలు (మీనా) ఇంకా గొప్పగా నటించింది.   తండ్రీ–కొడుకు–మనవరాలు... ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ఎమోషనల్‌ జర్నీ 'సీతారామయ్యగారి మనవరాలు'.
Image result for సీతారామయ్యగారి మనవరాలు
మొదటి సినిమాతో నే నటన పరంగా అందరి హృదయాలు గెల్చుకున్న మీనా తర్వాత టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.  అప్పట్లో అగ్రహీరోల సరసన నటించిన మీనా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మీనా కాస్టింగ్ కౌచ్ గురించి ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేసింది.  సినీ పరిశ్రమలో క్యాస్టంగ్ కౌచ్ అనేది ఒక విచారకరమైన అంశమని నటి మీనా తెలిపింది.
Image result for aravind swamy
మా కాలంలో కూడా లైంగిక వేధింపులు ఉన్నాయని... అయితే, తనకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని చెప్పింది.  వంకర బుద్ది మగవాళ్లు ఏ ఫీల్డ్ లో అయినా ఉంటారని..అలాంటి వారి పరిస్థితి చూసి దూరంగా ఉంటే ఏవరికీ ఏ ఇబ్బంది ఉండదని అన్నారు.   ఒక స్త్రీతో డీల్ చేసేముందు తమకు కూడా భార్య, పిల్లలు ఉన్నారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని సూచించింది.
Image result for vijay
తన కెరీర్ లో ఎంతో మంది అగ్ర హీరోల సరసన నటించానని..కానీ తనకు ఇష్టమైన రోజా ఫేమ్ అరవింద స్వామితో నటించలేక పోయానని..ఇక హీరో విజయ్ తో ఎన్నో సార్లు ఛాన్స్ వచ్చినా..కాల్షీట్స్ ప్రాబ్లం వల్ల సెట్ కాలేదని అన్నారు.  అయితే 'షాజహాన్' చిత్రంలో ఆయనతో కలసి ఓ పాటలో నటించానని చెప్పింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: