వివాహం అంటే అటు ఏడు తరాలు..ఇటు ఏడు తరాలు చూసుకొని పెద్దలు ఒక అంగీకారానికి వచ్చి పిల్లలను ఒప్పించి వాళ్లను ఒక ఇంటివాళ్లను చేస్తారు.  అయితే సెలబ్రెటీల విషయంలో వివాహం అంటే ముందునుంచే పెద్ద హడావుడి ఉంటుంది.  తాజాగా అవును చిత్రంతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి పూర్ణ.  తాజాగా ఈ అమ్మడు వివాహానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది.  ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటేంటే..నటి పూర్ణ తన వివాహం విషయంలో ఎన్నో షరతులు పెడుతుందట. 

Image result for నటి పూర్ణ

వాస్తవానికి పూర్ణ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పేరు మార్చుకుంది.  వీరిది ముస్లిం కుటుంబం..మొదటి నుంచి స్టేజ్ షోలు చేయడం అలవాటు చేసుకున్న పూర్ణ మొదట మళీవుడ్ లో చిన్న పాత్రతో ఎంట్రీ ఇచ్చింది.  ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఫ్యామిలీ తరహా చిత్రాల్లో నటిస్తూ వస్తుంది.  తాజాగా పెళ్లికి షరతులు వర్తిస్తాయ్ అంటోంది కేరళ బ్యూటీ. పేరు పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీం. ఈమె తమిళం, తెలుగు అంటూ బహుభాషా నటిగా రాణిస్తోంది.  పూర్ణ... ప్రస్తుతం తమిళంలో ఒకటి, మలయాళంలో మూడు సినిమాలను చేస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, తనకు మలయాళం చిత్రాల కంటే తమిళంలోనే ఎక్కువ పేరు వచ్చిందని... దీనికి కారణం మలయాళంలో పెద్ద హీరోలతో చేయకపోవడమేనని చెప్పింది.

Image result for నటి పూర్ణ

తాను డ్యాన్స్ కళాకారిణిని కావడంతో... తనకు అక్కడ డ్యాన్స్ అవకాశాలు ఉన్న పాత్రలే వస్తున్నాయని తెలిపింది. ఒక సమయంలో నేను నటించిన 'చట్టకారి' చిత్రం ఫ్లాప్‌ అవడంతో నటనకు స్వస్తి చెప్పి నృత్య కార్యక్రమాలను చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. అలాంటి సమయంలో ఇతర భాషల్లో అవకాశాలు రావడం మొదలెట్టాయి. అవి నమ్మకాన్ని కలిగించడంతో మళ్లీ నటించాలన్న నిర్ణయం తీసుకున్నాను. తమిళంలో నటించిన 'సవరకత్తి', 'కొడివీరన్‌' చిత్రాలు నా మనసు హత్తుకున్నాయి.


ప్రస్తుతం తన కుటుంబ సభ్యులు తనకు పెళ్లి చేయాలనే యోచనలో ఉన్నారని..నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చేవారు చాలా కండీషన్స్ పెడుతున్నారని..ఒకదశలో పెళ్లి తర్వాత సినిమాలు పూర్తిగా మానివేయాలని షరతులు పెడుతున్నారని తెలిపింది.  కానీ తనకు నటన అంటే ఎంతో ఇష్టం అని..పెళ్లి తర్వాత కూడా ఛాన్సులు వస్తే తప్పకుండా నటిస్తానని..నా మాటకు గౌరవం ఇచ్చే వారిని నేను పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పేస్తుంది ఈ మాలీవుడ్ బ్యూటీ.

మరింత సమాచారం తెలుసుకోండి: