జగ పతి బాబు ఒకప్పుడు హీరోగా వెలుగు వెలిగి ఇప్పడూ విలన్ గా ఇండస్ట్రీ ను ఏలుతున్నాడు. అయితే జగపతి బాబు తన ఆర్ధిక కష్టాల గురించి చెప్పుకోవడానికి ఎప్పుడు వెనుకాడడు అయితే జగ పతి బాబు తాను అనుభవించిన ఆర్ధిక కష్టాల గురించి చాలా విషయాలు చెప్పాడు. హీరోగా హిట్లు లేక, అవకాశాలు మందగించిన సమయంలో ఖర్చులకు కూడా ఇబ్బందిపడిన సందర్భం ఉందని జగపతిబాబు మొహమాటం లేకుండా చెబుతాడు.

Image result for jagapathi babu

తాజాగా ఒక ఇంటర్వ్యూలో అలాంటి కష్టకాలంలో తనను ఆదుకున్న వాళ్ల గురించి కూడా జగపతి చెప్పాడు. ఎవ్వరూ తనకు డబ్బులు ఇవ్వలేదని, ఆ విషయంలో తనకు బాధ కూడా ఏమీలేదని.. ఎవ్వరో ఇస్తారని కూడా తను ఎక్స్ పెక్ట్ చేయలేదని జగపతి వివరించాడు. అయితే పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తను కష్టకాలంలో ఉన్నప్పుడు 50లక్షల రూపాయలు ఇచ్చాడని, అది అప్పుగా.. అయితే వడ్డీ లేకుండా ఆ డబ్బులిచ్చాడని జగపతి వివరించాడు.

Image result for jagapathi babu

అయితే ఆ డబ్బును కొంతకాలం తర్వాత ఆయన అడిగారని.. దాన్ని తిరిగివ్వడానికి మాత్రం తను మరో అప్పు చేయాల్సి వచ్చిందని జగపతి నవ్వుతూ చెప్పాడు. ఇదంతా గతం.. ఇప్పుడు జగపతి బాబుకు చేతినిండా అవకాశాలున్నాయి. మంచి రెమ్యూనరేషన్ కూడా దక్కుతోంది. ఇప్పుడు కూడా ఏదో విలాసంగా బతికేయాలని తనకేం లేదని.. ఖరీదైన కార్లు, బంగ్లా కొనేయాలని లేదని.. అపార్ట్‌మెంట్లోనే ఉంటున్నానని జగపతి వివరించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: