ఒకప్పుడు టాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మాన్ గా పిలిపించుకున్న హీరో డాక్టర్ రాజశేఖర్.   కెరీర్ బిగినింగ్ లో విలన్ పాత్రలో నటించిన రాజశేఖర్ ‘అంకుశం’, ‘ఆహుతి’పవర్ ఫుల్ సినిమాలతో యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్నారు.  అయితే వరుసగా ఆ తరహా సినిమాలతో జనాలకు బోర్ కొడుతుందని గ్రహించిన రాజశేఖర్ అల్లరి ప్రియుడు సినిమాతో ఫ్యామిలీ తరహా పాత్రల్లో నటించడం మొదలు పెట్టాడు.  అప్పటి నుంచి ఎన్నో ఫ్యామిలీ తరహా సినిమాల్లో నటించిన రాజశేఖర్ గత కొంత కాలంగా వరుసగా ఫ్లాపులు చవిచూశారు.

దాంతో కెరీర్ కష్టాల్లోపడింది..కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న రాజశేఖర్ గత సంవత్సరం  'గరుడ వేగ' భారీ విజయాన్ని సాధించింది. చాలా కాలం తరువాత రాజశేఖర్ కి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది.  ఒకదశలో రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని..ఆయన విలన్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెగ వార్తలు వచ్చాయి.  వాటన్నింటికి చెక్ పెడుతూ.. 'గరుడ వేగ' అద్భుతమైన విజయాన్ని సాధించిన తన స్టామినా ఎంటో నిరూపించారు.  ఈ కారణంగానే కథల ఎంపిక విషయంలో ఆయన శ్రద్ధ పెట్టారు.
Image result for dhansika
రీసెంట్ గా ఆయనకి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక కథను వినిపించడం, ఆయన ఓకే చేసేయడం జరిగిపోయాయి.ఈ సినిమాకి 'కల్కి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. సి.కల్యాణ్ .. రాజశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  అయితే ఈ సినిమాలో అంజలి హీరోయిన్ అనుకున్నారు..ఇప్పుడు మరో కొత్త పేరు వినిపిస్తుంది.  గతంలో రజినీకాంత్ నటించిన  'కబాలి' మూవీలో ఆయన కూతురుగా చేసిన సాయిధన్సికను కూడా తాజాగా ఎంపిక చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అంజలి స్థానంలో సాయిధన్సికను తీసుకున్నారా? లేదంటే ఇద్దరు కథానాయికలతో రాజశేఖర్ జోడీ కడుతున్నారా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: