తెలుగు ఇండస్ట్రీలో ప్రతి సంవత్సరం ఎంతో ఘరంగా అంగరంగ వైభవంగా ‘సంతోషం ఫిలిం అవార్డ్స్’ కార్యక్రమం జరుగుతుంది.  ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీకి చెందిన అతిరథ మహారథులు విచ్చేస్తారు.  అన్ని విభాగాల్లో సంతోషం అవార్డు ఇస్తారు.  ఒకరకంగా చెప్పాలంటే..దక్షిణ భారత సినీ రంగంలో ప్రధానమైన అవార్డుల్లో ‘సంతోషం ఫిలిం అవార్డ్స్’ఒకటి.  16వ సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం  హైద‌రాబాద్‌లోని జేఆర్సీ క‌న్వెన్షన్ సెంట‌ర్లో వైభవంగా జ‌రిగింది.  


ఈ  వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ గాన కోకిల ఎస్.జాన‌కి ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ వేడుకకు టాలీవుడ్ ద‌ర్శక‌ నిర్మాత‌లు, రాజ‌కీయ ప్రముఖులు విచ్చేశారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్నడ భాష‌ల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన న‌టీన‌టుల‌కు అవార్డులు ప్రదానోత్సవం జరిగింది.  మెగాస్టార్ చిరంజీవి పది సంవత్సరాల గ్యాప్ తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ తో రీ ఎంట్రీ ఇచ్చారు.

Priceless!

 రైతులకు అద్భుతమైన మెసేజ్ ఈ చిత్రంలో ఉంది.  ఇక తెలుగులో ఉత్తమ నటుడు అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. చిరంజీవికి ఎస్.జానకి అవార్డును అందజేశారు. ‘ఖైదీ నంబర్ 150’లో నటనకు గాను చిరంజీవికి ఈ అవార్డు దక్కింది. ఉత్తమ నటి అవార్డు శ్రియాను వరించింది. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంలో నటనకు గాను శ్రియాకు ఉత్తమ నటి అవార్డు అందజేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..నాకు అవార్డు ఇస్తానని అంటే వేడుకకు రాను. ఇవ్వబోనని చెబితేనే వస్తానని సురేశ్ కు ముందే చెప్పాను. కానీ, నన్ను మోసం చేసి, గానకోకిల ఎస్ జానకి చేతుల మీదుగా అవార్డు ఇప్పించి, నన్ను లాక్ చేశాడు. కాదనలేకపోతున్నా" అని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చిరంజీవి చేతుల మీదుగా గాన కోకిల ఎస్.జానకి జీవిత సాలఫ్య పురస్కారం అందుకున్నారు. అలాగే ప్రముఖ నటులు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కు క్కినేని నాగేశ్వరరావు స్మారక అవార్డును ప్రదానం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: