Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 19, 2018 | Last Updated 6:10 pm IST

Menu &Sections

Search

భారీ రెమ్యూనరేషన్ ₹10 కోట్లు డిమాండ్ చేయనున్న విజయ్ దేవరకొండ?

భారీ రెమ్యూనరేషన్ ₹10 కోట్లు డిమాండ్ చేయనున్న విజయ్ దేవరకొండ?
భారీ రెమ్యూనరేషన్ ₹10 కోట్లు డిమాండ్ చేయనున్న విజయ్ దేవరకొండ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

tollywood-news-vijay-devarakonda-geeta-govindam-₹1

అభిమాన ప్రేక్షకులు వరదలా వచ్చి ధియేటర్లను నింపేసి కేవలం పద్నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడితో కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన సినిమాపై, ఒక పన్నెండు రోజుల్లో వంద కోట్ల రూపాయల వసూళ్ళ వర్షం కురిపించారు,  గీత గోవిందం దాని విజయం అపూర్వం మొత్తం సినిమాని తన భుజస్కందాలపై మోసిన ఈ సినిమా విజయం ప్రస్తుతానికి అద్భుతమే. పెళ్ళి చూపులు సినిమాలోని సాధారణ కథానాయకుడు అర్జున్ రెడ్డిగా మారి విజృంభించాడు. 

tollywood-news-vijay-devarakonda-geeta-govindam-₹1

మొత్తం ఒక సంవత్సర కాలం లో ఆయన దశ తిరిగింది. ఒక సంవత్సరం కిందట విజయ్ దేవరకొండ ఒక చిన్న నటుడు. కాలం గిర్రున తిరిగింది గత సంవత్సరం ఆగస్టు లో విడుదల అయిన ‘అర్జున్ రెడ్డి’ అతడి చరిత్ర గతిని జాతకాన్ని పూర్తిగా మార్చేసింది. అర్జున్ రెడ్డికి ముందు విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో తొలి సూపర్ హిట్‌ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే అర్జున్ రెడ్డి తర్వాత అతడి దిశ మారి దశ తిరిగిపోయింది. ఆ సినిమా అందించిన సంచలన విజయంతో విజయ్ దేవరకొండ యువతరం లోనే మేటి కథానాయకుడయ్యాడు.

tollywood-news-vijay-devarakonda-geeta-govindam-₹1

మహానటి లో అతడిది అతిధి పాత్రే అయినా మంచి గుర్తింపు వచ్చి ఆ సినిమాతో చివరకు ఒక "యూత్ ఐకాన్‌" గా మారిపోయాడు. గీత గోవిందం ఒక ఆయన్ని తారాపథాని కి తీసుకెళ్ళింది. అర్జున్ రెడ్డి సినిమా నచ్చని వాళ్ళు సైతం గీత గోవిందం తో ముచ్చట పడ్డారు. గీత గోవిందం మరో సంచలనంగా నిలుస్తోందిప్పుడు. ఇప్పటికే ఈ పన్నెండు రోజులకే సినిమా వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల మార్కును దాటేసి, నిర్మాతల షేర్ గా ₹52 కోట్లు అందించటం అంటే 272% నెట్ ప్రోఫిట్స్ సాధించింది. తద్వారా ఈ సినిమాలో  వ్యాపారభాగస్వాములైన ప్రతి ఒక్కరి పంట పండించింది. 

tollywood-news-vijay-devarakonda-geeta-govindam-₹1

గత 2017 ఆగస్టులో ఒక సూపర్ హిట్‌ 2018 ఆగష్ట్ లో మరో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ - భవిష్యత్ లో నటించనున్న సినిమాల రెమ్యూనరేషన్‌ ను పెంచేశాడని చిత్ర నగరిలో బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న "నోటా - డియర్ కామ్రేడ్" సినిమాల తరవాత నటించబోయే సినిమాలకు ఈ కథానాయకుడు పది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్‌ ను డిమాండ్ చేస్తున్నాడనే వార్తలు గుప్పుమంటున్నాయి. అధికారిక వివరణ లేకపోయినా, వరస విజయాలతో, యూత్‌ లో ఐకన్ గా బ్రహ్మాండమైన క్రేజ్‌ సంపాదించుకున్న యువ హీరో ఆ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం పెద్ద విశేషం కూడా కాదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

 tollywood-news-vijay-devarakonda-geeta-govindam-₹1

tollywood-news-vijay-devarakonda-geeta-govindam-₹1
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాజకీయ వర్షంలో తడిసిపోనున్న మిర్యాలగూడా కులం బాధితురాలు అమృతవర్షిని
టిఆరెస్ స్పీడ్ - మహాకూటమి బేజార్!  కూటమికి పురిట్లోనే సంధి కొడుతుందా?
బిజెపి రాష్ట్రాన్ని ముంచింది - కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ లోటు భర్తీ అవుతుంది: రాహుల్ గాంధి
ఎమెల్యే ఆర్కె రోజాపై చేసిన ధారుణ వ్యాఖ్యలకు టిడిపి ఎమెల్యే బోడే ప్రసాద్ కు హైకోర్ట్ షాక్
కేరళ పోలీసులు ఇస్రో మాజీ శాస్త్రవేత్తకు చేసిన అన్యాయానికి సుప్రీం కోర్టు తీర్పు చెంపపెట్టు
టిఆరెస్ గెలిస్తే రాష్ట్రం రావణ కాష్టమే - రజాకార్ల పాలనే!: అమిత్ షా
"ఆపరేషన్ గరుడ" విషయంలో శివాజిని నిఘాసంస్థలు విచారించవలసిన అవసరంలేదా?
వారంట్ కే  ఇంత సీనా? నటుడు శివాజికి మానసిక సమస్యలున్నాయా?
బ్రేకింగ్ న్యూస్: ఇండియా టుడే  2018-19 ఎలక్షన్ సర్వే మోడీ - కెసిఆర్ హిట్ - చంద్రబాబు ఫట్
ఆంధ్రా పోలీసులను – దొంగల ముఠాలా కాంగ్రెస్ కోసం మొహరించారు: టీఆర్‌ఎస్
స్పెషల్:  ఎవరి కోసం అమరావతి? కులవాదంతో తరిస్తే అది భ్రమరావతే?
ఒక ప్రయాణం మరచి పోలేని వ్యక్తులు ఇద్దరు - రాజకీయ నాయకులు అంతా ఒకటి కాదు
బాబు ప్రభుత్వం చెసే ప్రతి తప్పుడుపనికి కర్తలు వేరెవాళ్ళు? క్రెడిట్స్ కి కారణ కర్త మాత్రం తనే!
About the author