ప్రస్థుతం టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న “గీత గోవిందం” 100 కోట్ల గ్రాస్ కలక్షన్స్ ను క్రాస్ చేసింది అంటూ ఈమూవీ నిర్మాణ సంస్థ పేరిట విడుదల చేయబడ్డ కలక్షన్స్ పోస్టర్ పై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈమూవీ 50 కోట్లు క్రాస్ చేసిన విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేకపోయినా ఈమూవీ 100 గ్రాస్ కలక్షన్స్ మాత్రం ఇప్పటికీ ఇంకా జరగని విషయం అని అంటున్నారు.
A still from Geetha Govindam/Image from YouTube.
టాలీవుడ్ కలక్షన్ పండితుల అంచనాలు ప్రకారం ఇప్పటికి ఈమూవీ 85 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వరకు వచ్చి ఉంటుందని ఈవారాంతానికి 100 కోట్ల సినిమాగా మారే ఆస్కారం ఉంది అని అంటున్నారు. అయితే మరికొన్ని రోజులలో రాబోయే కలక్షన్స్ ను ఊహించుకుని అల్లు కాంపౌండ్ ఈపోస్టర్ ను అత్యుత్సాహంతో ఎందుకు విడుదల చేసింది అన్న విషయమై చాలమందికి సమాదానం లేని ప్రశ్నగా మారింది.
Geetha-Govindam-Telugu-Movie-Latest-Stills–Posters4
ఇది ఇలా ఉండగా ఈమూవీని కేవలం అల్లు అరవింద్ 10 కోట్ల బడ్జెట్ తో పూర్తి చేసాడని ఈమూవీ టోటల్ బిజినెస్ పూర్తి చేసుకునేసరికి అరవింద్ కు 40 కోట్ల మేరకు లాభాలు వచ్చినా ఆశ్చర్యం లేదు అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి.  ఈమూవీ ఫైనల్ ఔట్ పుట్ చూసి ఈమూవీ బ్లాక్ బస్తర్ హిట్ అవుతుందనే ఊహతో చాలా ఏరియాలకు ఈమూవీ విషయంలో ఆఫర్లు వచ్చినా కేవలం తన పది కోట్లు రికవర్ అయ్యే వరకు బిజినెస్ చేసి మిగతా ఏరియాలు అన్నీ అరవింద్ తన వద్దనే ఉంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఒక టాప్ హీరోతో ఒక భారీ స్థాయి సినిమాను నిర్మించినా ఈరేంజ్ లో ఎవరికీ లాభాలు రావు అని అంటున్నారు. దీనికితోడు ఈమూవీ డబ్బింగ్ రైట్స్ కోసం బాలీవుడ్ కోలీవుడ్ శాండీల్ ఉడ్ ల నుండి భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ అయితే ఈమూవీని డైరెక్ట్ గా బాలీవుడ్ లో రీ మేక్ చేసే విషయంలో అల్లు అరవింద్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. గతంలో ‘గీతా ఆర్ట్స్-2’లో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ అరవింద్‌కు అప్పట్లో రూ.20 కోట్లకు పైగా లాభం అందిస్తే ‘గీత గోవిందం’ దానికి రెట్టింపు లాభం తెచ్చిపెడుతుందని అంటున్నారు..  
 


మరింత సమాచారం తెలుసుకోండి: