అన్న నందమూరి తారకరాముడి బయోగ్రఫి ఎంటీయార్ పేరిట తనయుడు బాలక్రిష్ణ సినిమా తీస్తున్న సంగతి విధితమే ఈ మూవీలో ఎన్నో హైలెట్స్ ఉంటాయంటున్నారు. లేటెస్ట్ గా నందమూరి హరిక్రిష్ణ పాత్రను ఆయన తనయుడు కళ్యాణ్ రాం ఈ మూవీలో ప్లే చేస్తాడని టాక్. దాంతో ఒక్కసారిగా హైప్ పెరిగిందంటున్నారు. 


అన్న గారి చైతన్య రధ సారధిగా హరిక్రిష్ణ పాత్రకు మూవీలో ఎంతో ఇంపార్టన్స్ ఉందంటున్నారు.  అప్పట్లో టీడీపీలో హరిక్రిష్ణ చురుకైన పాత్ర పోషించారు. ఆ విశేషాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయట. ఇప్పటికే తన తండ్రి పాత్రను బాలయ్య చేస్తూంటే, హీరో కళ్యాణ్ రాం తన తండ్రి హరి పాత్రను పోషించడం ఆసక్తికరమే.


ఈ మూవీలో ఇలాంటి ఇంటెరెస్టింగ్ మ్యాటర్స్ బోలెడు ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది. మరి ఎంత తొందరగా అన్న గరి మూవీ విడుదలైతే అంత వేగంగా చూడాలని ఫ్యాన్స్ తో పాటు తెలుగువారంతా ఎదురుచూస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: