తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో వరుణ్ తేజ్.   మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ‘ముకుంద’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా..తర్వాత వచ్చిన ‘కంచె’ చిత్రంతో అద్బుతమైన పేరు తెచ్చుకున్నాడు.  ఆ తర్వాత వచ్చిన లోఫర్ పెద్దగా పేరు తీసుకు రాకపోయినా..‘ఫిదా’, ‘తొలిప్రేమ’తో తనకంటూ మంచి ఇమేజ్ సంపాదించాడు వరుణ్ తేజ్.  వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరోకి అవకాశాలు కూడా భారీగానే వస్తున్నాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. 
Image result for chirjaneevi hero movei
అయితే ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్ కెరీర్ కష్టాల్లో ఉన్నపుడు కరుణాకరణ్ దర్శకత్వంలో వచ్చిన ‘తొలిప్రేమ’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఇదే టైటిల్ తో ఈ మద్య వరుణ్ తేజ్ చిత్రం కూడా అద్భుత విజయం సాధించింది. ఇప్పుడు పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్‌ను వాడబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం సంకల్ప్ రెడ్డితో చేస్తున్న అంతరిక్షం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.
Image result for toli prema pawan
మరోవైపు హీరో వెంకటేష్‌తో కలిసి ఎఫ్2తో సందడి చేయబోతున్నాడు.  ఇదిలా ఉంటే..త్రినాథరావు నక్కినతో మరో చిత్రంలో నటిస్తున్నాడు. త్రినాథరావుతో చేయబోయే సినిమాకు మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్‌ను ఫిక్స్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించనున్న ఈ సినిమాకు చిరు టైటిల్ ‘హీరో’ను ఫిక్స్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: