ఈ మద్య సినిమా హీరోలు తెగ ప్రయోగాలు చేస్తున్నారు.  సినిమా అనగానే నాలుగు ఫైట్లు, నాలుగు సాంగ్స్, క్లయిమాక్స్..ఇదే పద్దతి కొనసాగుతుంది.  ఇలాంటి సినిమాల్లో నటించి తెగ బోర్ కొడుతున్న కొంత మంది హీరోలు నటనకు ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఆ మద్య మాస్ మహరాజు రవితేజ ‘రాజా ది గ్రేట్’ సినిమాలో పూర్తిగా అంధుడిగా నటించి మెప్పించాడు.  ఇక రాంచరణ్ ‘రంగస్థలం’ సినిమాలో చెవిటి వాడి పాత్రలో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందాడు. 
Image result for saif ali khan
ఇక బాలీవుడ్ లో సైతం కొంత మంది హీరో, హీరోయిన్లు డీ గ్లామర్ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో  స్టార్ హీరోని గుర్తు పట్టమంటే చాలా కష్టంగా అనిపిస్తోంది.  ఇంతకీ ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా..! బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్.  ప్రస్తుతం ఆయన ‘హంటర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సెట్స్ నుంచి సైఫ్‌కి సంబంధించిన కొన్ని పిక్స్ లీక్ అయి నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. 

ఇప్పటి వరకు చాలా రిచ్ పాత్రల్లో నటించి ఎంతో స్టైలిష్ గా కనిపించి సైఫ్ అలీఖాన్ రెడ్ షర్ట్, వైట్ ధోతిలో సైఫ్ చాలా భయంకరంగా కనిపిస్తున్నారు.  ముంబై ఫిల్మిస్థాన్ నుంచి ఈ పిక్స్ లీకైనట్టు తెలుస్తోంది.   సినిమాలో సైఫ్ నాగ సాధు అనే కొత్త గెటప్‌లో కనిపించబోతున్నారని అర్థమైంది. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా లీడ్ రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్‌లోని దసూరి (ఉదయ్‌పూర్ నుంచి రెండు గంటల జర్నీ)లో జరుగుతోంది. ఈ సినిమాలో మాధవన్ కీలకపాత్రలో నటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: