చిన్న సినిమాగా వచ్చి సంచలనం విజయం అందుకున్న వాటిలో ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ గీతా గోవిందం చేరింది. ఈ సినిమా కలక్షన్స్ బీభత్సం చూస్తుంటే స్టార్ హీరోల మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉన్నాయంటే నమ్మాలి. ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా మీద కాపీ మరక పడింది. 


ఆ మరక వేసింది కూడా అలాంటిలాంటి ఆయన కాదు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు గారు. ఆయన చేసిన ఏ సినిమాకు గీతా గోవిందం కాపీ అంటే ఆయన చేసిన పెళ్లిసందడి సినిమాకు ఇది కాపీ అంటున్నారు. అదేంటి ఆ కథ వేరే ఈ కథ వేరే కదా మరి ఎందుకు రాఘవేంద్ర రావు అలా అన్నారంటే.


ఇది సరదాగా అన్నమాటే.. ఆ సినిమా కలక్షన్స్ తో పోల్చుతూ గీతా గోవిందం తో పోలిక పెట్టేశారు దర్శకేంద్రుడు. శ్రీకాంత్, రవళి, దీప్తి పట్నాకర్ నటించిన ఆ సినిమా కోటి లోపే బడ్జెట్ కాగా 10 కోట్ల పైన వసూళ్లను రాబట్టిందట. అప్పట్లో పెళ్లిసందడి సినిమా బ్లాక్ బస్టర్ హిట్. 


ఆ సినిమాలానే 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయిన గీతా గోవిందం 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం మాములు విషయం కాదు. ఆ సందర్భాన్ని గుర్తుచేస్తూ అది అల్లు అరవింద్ సినిమానే కాబట్టి కలక్షన్స్ విషయంలో కాపీ అనేశారు రాఘవేంద్ర రావు. విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించిన గీతా గోవిందం సినిమాను పరశురాం డైరెక్ట్ చేయగా బన్ని వాసు నిర్మించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: