తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే ఓ ప్రభంజనం..ఎంతో మంది యువ హీరోలకు ఆదర్శం. పునాధిరాళ్లతో ఇండస్ట్రీలో పునాది వేసిన ఆయన ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఇప్పుడు మెగాస్టార్ అయ్యారు.  ఆ మద్య స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ..మెగాస్టార్ వేసిన రోడ్డుపై మేము హ్యాపీగా నడుస్తున్నామని..ఆయన మెగా వటవృక్షం అని..ఆ చెట్టు నీడన మేం బతుకుతున్నామని అన్నారు.  ఇక రాంచరణ్ మాట్లాడుతూ..నాన్నలా నటించకున్నా..ఆయనలోని మంచితనం మేము చాటుకుంటే చాలు అన్నారు.

ఈ నెల 22 న మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఓ కార్యక్రమం జరిగింది.  ఈ సందర్బంగా ఓ చిన్నారి మెగాస్టార్ చిరంజీవి  నటించిన 150 సినిమాలను గడగడా చెప్పేసి అందరినీ ఆశ్చర్యంతో ముంచెత్తింది. అంతేకాదు.. ఆ సినిమాలు ఏ రోజున రిలీజ్ అయ్యాయి? ప్రొడ్సూసర్ ఎవరు? డైరెక్టర్ ఎవరు? తదితర అన్ని విషయాలనూ చెప్తానని వెల్లడించింది. శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని.... చిరు సినీ ప్రస్థానంతో పోల్చి ఏమాత్రం తడుముకోకుండా అనర్గళంగా చెప్పేసి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. 

దాంతో అక్కడ ఉన్న యాంకర్ సైతం ఆశ్చర్యపోయింది..అభిమానుల  కేరింతలు కొట్టారు.  ఏడేళ్ల వయసు చదువుతుంది మూడో క్లాస్..కానీ ఆ చిన్నారి ప్రతిభ అసామాన్యమైందని తెగ పొగిడారు.  ఆ సమయంలో చిరు అక్కడ లేరు కానీ తర్వాత విషయం తెలుసుకున్న ఆయన హాసినిని ఇంటికి పిలుపించుకుని మరీ అభినందించారు. హాసిని తన తల్లిదండ్రులు, అన్నతో కలిసి చిరు ఇంటికి వెళ్లింది. చిరు, రామ్ చరణ్.. చిన్నారిని అభినందించారు. తాజాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: