తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది.  తాజాగా కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవదాస్’.  ఈ చిత్రంపై మొదటి నుంచి విపరీతమైన అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మద్య ఫస్ట్ లుక్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 
Image result for దేవదాస్
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాని ఈ మద్య ‘దేవదాస్’ చిత్రానికి గురించి హౌజ్ సభ్యులతో కూడా చర్చించారు.  ఇద్దరు స్టార్ హీరోలు నాగార్జున, నానిలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాలో రష్మిక మందన, ఆంకాక్ష లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.
Image result for దేవదాస్
దేవగా నాగ్, దాస్‌గా నాని అలరించనున్నారు.రేపు(బుధవారం) నాగ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనుంది చిత్రబృందం. ‘వారు వీరు’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో వేచి చూడాలి.  వైజయంతి ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.  తాజాగా ఈ సాంగ్ కి సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 

Image result for దేవదాస్


మరింత సమాచారం తెలుసుకోండి: