బిగ్ బాస్ సీజన్ 2 కేవలం మరో 4 వారాలు మాత్రమే ఉన్న కారణంగా హౌజ్ మెట్స్ మధ్య గరం గరం డిస్కషన్స్ జరుగుతున్నాయి. హౌజ్ లో ఉన్న అందరికి ఒక్కడే టార్గెట్ అది కూడా కౌశల్ మాత్రమే. రాఖీ రోజు నాని వచ్చి ఎంత మొత్తుకున్నా మళ్లీ నిన్న జరిగిన నామినేషన్స్ లో కౌశల్ ను టార్గెట్ చేశారు.


ఇక నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగానే ఆరోజు షో ముగిసిన నాటి నుండి శుక్రవారం వరకు ఓటింగ్ జరుగుతుంది. అయితే ఫోన్ కాల్స్, గూగుల్ సెర్చ్ ఇవేవి రాత్రి కొద్దిసేపు పనిచేయలేదు. అనుకున్నట్టుగానే గణేష్, నూతన్, సామ్రాట్ లతో పాటుగా ఈసారి కౌశల్ నామినేషన్స్ లో ఉన్నాడు. 


కౌశల్ నామినేషన్ లో ఉన్నాడు కాబట్టి ఓటింగ్స్ అన్ని అతనికే వచ్చేస్తాయని భావించి కావాలనే కుట్ర పన్ని బిగ్ బాస్ టీం రాత్రి ఓటింగ్స్ కు అంతరాయం కలిగించారని కామెంట్స్ చేస్తున్నారు కౌశల్ ఆర్మీ సభ్యులు. ఓటింగ్స్ లేటైనా సరే వెంట్రుక కూడా పీకలేరని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. 


చూస్తుంటే బిగ్ బాస్ విన్నర్ గా కౌశల్ కాకుండా వేరే ఎవరైనా అయితే మాత్రం ఆ సీన్ వేరేలా ఉంటుందనిపిస్తుంది. కౌశల్ ను ఎన్నిసార్లు నామినేట్ చేసినా సరే అతని ఆర్మీ వల్ల సేఫ్ అవుతున్నాడు. కౌశల్ ఆర్మీ వల్ల మిగతా హౌజ్ మెట్స్ కు ఇబ్బందులు మొదలయ్యాయి. ఈసారి నామినేషన్స్ లో ఉన్న గణేష్ దాదాపు ఎలిమినేట్ అవడం ఖాయమని అంటున్నారు. కౌశల్ తో గొడవపడే సందర్భంలో గణేష్ చేసిన అతి ఆర్మీకి నచ్చలేదు అందుకే ఈసారి గణేష్ మీద ఫోకస్ పెట్టారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: