యంగ్ హీరో నాగశౌర్య భారీ అంచనాలు పెట్టుకుని నటించిన ‘నర్తనశాలకు’ హిజ్రాల అసమ్మతి వేడి తగిలినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈమూవీని ప్రమోట్ చేస్తూ నాగశౌర్య తనకు అనేకమంది హిజ్రాలతో వ్యక్తిగత పరిచయం ఉందని వారి బాడీ లాంగ్వేజ్ ని పరిశీలించి తాను ‘నర్తనశాల’ లో నటించాను అని చెప్పడంతో అసలు వివాదం మొదలైంది.

తమ మనో భావాలకు వ్యతిరేకంగా తమను కించపరుస్తూ ఉండే సన్నివేశాలను వెంటనే తీసివేయాలని లేకుంటే ‘@నర్తనశాల’ ప్రదర్సించే ధియేటర్ల వద్ద ఆందోళన చేస్తూ ఆసినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది చాలదు అన్నట్లుగా కొంతమంది హిజ్రాలు హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ ముందు ఆందోళన చేయడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనడం హాట్ టాపిక్ గా మారింది.
JioPhone 2 with Qwerty keypad Flash Sale updates
నాగశౌర్య ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ  ‘గే’ పాత్ర పోషించడం కాస్త కష్టమైన విషయమే అయినా తన ఫ్రెండ్స్ లో చాలామంది గే లు ఉన్నారని దాంతో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ప్రవర్తన ను దగ్గరగా పరిశీలించడమే కాకుండా చాలాసార్లు పార్టీల్లో వాళ్ళను కలుస్తుంటానని అంటూ కామెంట్ చేసాడు. ఈ కామెంట్స్ మీడియా ద్వారా హిజ్రాలకు తెలియడంతో వారి మనో భావాలను కించపరిచే సీన్స్ ‘నర్తనశాల’ లో ఉన్నాయి అన్న అభిప్రాయంలో హిజ్రాలు ఉన్నట్లు టాక్. ఒక వెరైటీ పాత్ర కోసం తాను పడ్డ కష్టాన్ని నాగసౌర్య వివరించడంలో చేసిన చిన్న పొరపాటు హిజ్రాల మనోభావాలు బాగా దెబ్బ తీసినట్లు కనిపిస్తోంది. 
కొత్త దర్శకులతో పనిచేయడం
ఈమధ్య కాలంలో చాల సినిమాలకు ఇలాంటి వివాదాలు ముందుగా ఒక సామాజిక వర్గం నుండి విడుదలకు ముందు వస్తే ఆవివాదం ఆ సినిమా విజయానికి సహకరిస్తోంది. మరి ‘నర్తనశాల’ విడుదలకు ముందు వచ్చిన ఈవివాదం ఈమూవీకి ఎలాంటి ఓపెనింగ్స్ ఇస్తుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: