అక్కినేని వంశానికే ఉందేమో నిత్య నూతనత్వం. అందుకే తరాలు మారినా ఎవర్ గ్రీన్ బిరుదు మాత్రం ఆ వంశానికే చెల్లుతోంది. అలనాడు అక్కినేని నాగేశ్వర రావు యాభయ్యేళ్ళ వయసులో దసరా బుల్లోడుగా సరదా చేస్తే జనం ఎగబడి చూశారు. అరవైకి చేరువ అవుతూ అందాల శ్రీదేవితో ప్రేమాభిషేకం చేస్తే ప్రేక్షక లోకం నీరాజనం పలికారు. ఆయన వారసుడు నాగ్ ది అదే స్టైల్
రొమాంటిక్ కింగ్ :


నాగ్ లో రొమాంటిక్ కింగ్ ఉన్నాడు. కళ్ళతోనే చిలిపిగా లవ్ ఫీల్ చెప్తే ఫిదా అవని లేడీస్ ఉండరేమో. అందమైన భామలంతా వెంట పడక తప్పదేమో. వయసు మీద పడుతున్నా అందం అలా రెట్టింపు అవుతూ రోమాన్స్ కే  సరి కొత్త అర్ధం చెప్పే నట సామ్రాట్ మన నాగార్జున. నిన్నే పెళ్ళాడుతా మూవీ నాగ్ లోని ప్రేమ, శ్రుంగార రసాలను ఆవిష్కరిస్తుంది. అప్పట్లో సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా అది. ఇక నాగ్ తనకు తగ్గ టైటిల్ ఎంచుకుని చేసిన మన్మధుడి నాటి లేడీస్ డ్రీం  హీరో ఎవరో చెప్పేసింది.


భక్తిలోనూ సరి సాటి :


రక్తి మాత్రమే కాదు భక్తిని పలికించడంలోనూ  అక్కినేని ఫ్యామిలీకి సరిసాటి ఎవరూ లేరు. ఓ వైపు యువతను కిర్రెక్కించే ప్రేమ చిత్రాలు చేస్తూనే మరో వైపు అన్నమయ్యగా నాగ్ కనిపించేసరికి తెలుగు జనం షాక్ అయింది. అక్కడ నాగ్ కనిపించలేదు. వెంకన్న పరమ భక్తుడే దర్శనమిచ్చాడు. ఇంతలా లీనమై పోషించడం నాగ్ కే చెల్లింది. అదే కోవలో శ్రీ రామదాస్ గా మెప్పించాడు. ఇక షిరిడీ సాయిగా నాగ్ లాండ్ మార్క్ నటన ఎవరూ మరచిపోలేరు. రెండేళ్ళ క్రితం వచ్చిన ఓం నమో వెంకటేశాయ చిత్రంలో నాగ్ నటన లో ఎంతో మెచ్యూరిటీ కనిపించి భక్త జనాన్ని మెప్పించింది.


ప్రయోగాలకు కేరాఫ్ :


నాగ్ చేసిన ప్రయోగాలు టాలీవుడ్ లో ఎవరూ చెయలేదేమో. ఓ వైపు రొమాంటి వేషాలు వేస్తూనే అన్నమయ్యగా అవతరించడం నాగ్ కే సాధ్యం. అలాగే మన్మధుడు గా జేజేలు అందుకుంటున్న టైంలో శ్రీ రామదాస్ చేశాడు. మధ్యలో గ్రేట్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రవుతో ఆకాశా వీధిలో చేసి శభాష్ అనిపించుకున్నాడు. కెరీర్ మొదట్లోనే చేసిన  గీతాంజలి అతి పెద్ద ప్రయోగమే. అలాగే తండ్రి దేవదాస్ అయితే కొడుకు మజ్ఞూగా గుర్తుండిపోయే నటన కనబరచాడు. ఇక ఈ మధ్యనే ఊపిరి మూవీల నాగ్ పాత్ర మరో ప్రయోగం.


దేవ్ గా వస్తున్నాడు :


ఇపుడు లేటేస్ట్ మూవీ దేవదాస్ లో నాగ్ దేవ్ గా కనిపించబోతున్నాడు. ఇందులో నాచురల్ స్టాత్ నాని తో జోడీ కట్టిన నాగ్ మళ్ళీ ఎవర్ గ్రీన్
అనిపించేసుకుంటున్నాడు. నిర్మాతగా కూడా అనేక ప్రయోగాలు చేసిన నాగ్ తండ్రి హీరోయిన్ శ్రీదేవితో చాల సినిమాలు చేసి సరి జోడీ అనిపించుకున్నాదు. మరో వైపు తన కొడుకులు ఇద్దరితోనూ పోటీ పడుతూ నేనే హీరో అంటున్నాడు. పుట్టిన రోజు శుభ వేళ నాగ్ కి ఆల్  ది బెస్ట్.



మరింత సమాచారం తెలుసుకోండి: