ఈ మద్య సినిమాలు విడుదలకు ముందు..విడుదల తర్వాత పలు వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే.  డైలాగ్స్, క్యారెక్టర్స్, సాంగ్స్ విషయంలో ఏదో ఒక వివాదం బయటకు రావడం..అది కాస్త కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతినడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం..కోర్టు వరకు వెళ్లడం జరుగుతుంది.  ఈ మద్య యంగ్ హీరో నాగశౌర్య ఛలో సినిమాతో మంచి సక్సెస్ సాధించాడు.  తాజాగా నాగశౌర్య హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్‌లో ప్రొడక్షన్ నెం 2గా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘నర్తనశాల’. క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన శ్రీనివాస చక్రవర్తి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా.. నాగ శౌర్య తల్లి ఉష మూల్పూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. కశ్మీరా పరదేశి, యామిని భాస్కర్‌లు హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Related image
ఈ సినిమాలో నాగశౌర్య.. గే పాత్రలో పూర్తి స్థాయి వినోదాన్ని పంచనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్, టీజర్ సినిమాకు భారీ హైప్ తెచ్చిపెట్టాయి. దీనికి తోడు ప్రి రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. తాజాగా  ‘@నర్తనశాల’ సినిమాపై హిజ్రాలు నిరసన వ్యక్తం చేశారు.తమ మనోభావాలను కించపరిచేలా ఇందులో సన్నివేశాలు ఉన్నాయంటూ మంగళవారం ఫిల్మ్ ఛాంబర్‌ను ముట్టడించారు. వెంటనే ఆ సన్నివేశాలను సినిమా నుంచి తొలగించాలని డిమాండు చేశారు. లేకుంటే సినిమా విడుదల అడ్డుకుంటామన్నారు.   రాష్ట్ర వ్యాప్తంగా @నర్తనశాల ప్రదర్శిస్తున్న థియేటర్ ల ముందు ఆందోళన చేస్తామని అలాగే సినిమా ప్రదర్శించకుండా అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. 
naga shaurya starrer narthanasala movie censor talk
హిజ్రాలు ఫిల్మ్ ఛాంబర్ ముందు ఆందోళన చేయడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌లో శివాజీ రాజా ‘నా కొడుకు గే నా’ అనే డైలాగ్ ఈ వివాదానికి కారణమైంది. ఆందోళన చేస్తున్న హిజ్రాలతో శివాజీ రాజా మాట్లాడారు. వారి కోసం ‘@నర్తనశాల’ సినిమాను ప్రత్యేక ప్రదర్శన వేయిస్తామని, అభ్యంతరకర సన్నివేశాలు తొలగించేందుకు నిర్మాతలతో చర్చిస్తానని హామీ ఇచ్చారు.  నాగశౌర్య హీరోగా నటించిన ఈ చిత్రాన్ని నాగశౌర్య తల్లి ఉషా మూల్పూరి నిర్మించగా శ్రీనివాస చక్రవర్తి ఈ చిత్రం తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: