ప్రస్తుతం విజయ్ దేవరకొండ మ్యానియా తారా స్థాయికి చేరిపోవడంతో ఇప్పుడు చాలమంది నిర్మాతలు విజయ్ దేవరకొండ డేట్ లు ఎలా సంపాదించాలా ? అని కిందామీదా పడిపోతు రోజులు గడుపుతున్నారు. 14 కోట్ల సినిమాను 100 కోట్ల గ్రాస్ కలక్షన్స్ మూవీగా మార్చిన విజయ్ మ్యాజిక్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. 
vijay devarakonda taxi wala teaser Latest 2018 - Sakshi
ఇలాంటి పరిస్థుతులలో ఈయంగ్ హీరోకు అడిగినంత పారితోషికం ఇచ్చి అతడిని పట్టేయాలని ఎందరో ప్రయత్నిస్తున్నారు. కొంతమంది నిర్మాతలు అయితే తమకు విజయ్ తో వ్యక్తిగత పరిచయం లేని నేపధ్యంలో ఎవరైనా విజయ్ డేట్స్ ఇప్పించగలిగితే వారికి కోటి రూపాయల కమీషన్ ఇస్తాము అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వస్తున్నాయి.
Vijay Devarakonda to team up with sensible director Kranthi Madhav
ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ‘టాక్సీవాలా’ ‘నోట’ లు కాకుండా మైత్రీ మూవీస్ కు ఒక సినిమాను చేస్తున్నాడు. దీని తరువాత కేఎస్ రామారావుకు ఒక సినిమా చేయాలి. ఈసినిమాలు అన్నీ కూడ పాత రెమ్యూనరేషన్స్ లో ఉన్నవి. దీనితో ఈసినిమాల మధ్యనే తమ సినిమాలను కూడ ఒప్పించాలని చాలామంది నిర్మాతల ప్రయత్నం. 
ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం విజయ్ పారితోషికం 10 కోట్ల స్థాయికి చేరిపోయింది అంటున్నారు.
Vijay Devarakonda is now ready with Taxi Wala
టాప్ యంగ్ హీరోలుగా పేరుతెచ్చుకున్న మహేష్ జూనియర్ లకు ఈ స్థాయి పారితోషికం రావడానికి ఒక దశాబ్ద కాలం పైన పడితే కేవలం మూడవ సినిమాతోనే ఈరేంజ్ పారితోషిక స్థాయికి ఎదిగిన విజయ్ మ్యానియా నిలబడుతుందా లేకుంటే మరింత పెరిగిపోయి ఎవరికీ అందనంత స్థాయికి ఎదిగి పోతాడా అన్న విషయంలో క్లారిటీ రావాలి అంటే విజయ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల రిజల్ట్ వరకు వేచి చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: